ICC rankings : టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఆట‌గాళ్ల హ‌వా.. అన్నింటా మ‌నోళ్లే టాప్‌..

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను(ICC rankings) వెల్ల‌డించింది.

ICC rankings : టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఆట‌గాళ్ల హ‌వా.. అన్నింటా మ‌నోళ్లే టాప్‌..

ICC rankings Varun Chakravarthy becomes No1 T20I bowler for first time

Updated On : September 17, 2025 / 3:53 PM IST

ICC rankings : ఆసియాక‌ప్ 2025లో భార‌త జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సూప‌ర్ 4కి అర్హత సాధించింది. ఈక్ర‌మంలో ఐసీసీ విడుద‌ల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో(ICC rankings)నూ టీమ్ఇండియా ఆట‌గాళ్లు దుమ్మురేపారు. టీ20 బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి నంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకున్నాడు.

గ‌తంలో నాలుగో స్థానంలో ఉండ‌గా ఏకంగా మూడు స్థానాలు ఎగ‌బాకి అగ్ర‌స్థానానికి వ‌రుణ్ చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో భార‌త్ త‌రుపున టీ20ల్లో బౌలింగ్‌లో అగ్ర స్థానానికి చేరుకున్న మూడో బౌల‌ర్‌గా నిలిచాడు. గ‌తంలో బుమ్రా, ర‌వి బిష్ణోయ్‌లు ఈ ఘ‌న‌త సాధించారు.

BAN vs AFG : అందుకే బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయాం.. మా స్థాయి ఇది కాదు.. అఫ్గాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్ కామెంట్స్‌..

ఇక ఆసియాక‌ప్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు ప‌డ‌గొట్టిన స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ ఏకంగా 16 స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకుని 23వ ర్యాంకుకు చేరుకున్నాడు.

టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-5 బౌల‌ర్లు వీరే..

* వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి – 733 రేటింగ్ పాయింట్లు
* జాక‌బ్ డ‌ఫీ – 717 రేటింగ్ పాయింట్లు
* అకిల్ హుసేన్ – 707 రేటింగ్ పాయింట్లు
* ఆడ‌మ్ జంపా – 700 రేటింగ్ పాయింట్లు
* ఆదిల్ ర‌షీద్ – 677 రేటింగ్ పాయింట్లు

Sunil Gavaskar : గెలిచిన కెప్టెన్ చెప్పేదే వింటారు.. అఫ్రిదికి గ‌వాస్క‌ర్ కౌంట‌ర్

అటు హార్దిక్‌, ఇటు అభిషేక్‌..

బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శ‌ర్మ‌, ఆల్‌రౌండ‌ర్ విభాగంలో హార్దిక్ పాండ్యాలు త‌మ అగ్ర‌స్థానాల‌ను నిలుపుకున్నారు. తెలుగు ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ నాలుగో ర్యాంకుకు ప‌డిపోయాడు. ఇక పాక్ పై కీల‌క ఇన్నింగ్స్ ఆడిన సూర్య‌కుమార్ యాద‌వ్ ఓ స్థానం దిగ‌జారాడు. ఆరు నుంచి ఏడో స్థానానికి ప‌డిపోయాడు.