ICC T20 Rankings : దుమ్ములేపిన టీమ్ఇండియా యువ ఆట‌గాళ్లు.. రింకూసింగ్ 46, తిల‌క్ వ‌ర్మ‌10 స్థానాలు ఎగ‌బాకి..

ICC T20 Rankings - Rinku Singh : అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌క‌టించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యువ ఆట‌గాళ్లు దుమ్ములేపారు.

ICC T20 Rankings : దుమ్ములేపిన టీమ్ఇండియా యువ ఆట‌గాళ్లు.. రింకూసింగ్ 46, తిల‌క్ వ‌ర్మ‌10 స్థానాలు ఎగ‌బాకి..

Tilak Varma-Suryakumar Yadav

Updated On : December 13, 2023 / 6:51 PM IST

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌క‌టించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యువ ఆట‌గాళ్లు దుమ్ములేపారు. ఎప్ప‌టిలాగానే టీమ్ఇండియా తాత్కాలిక టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో 36 బంతుల్లో 56 ప‌రుగులు చేసి త‌న నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని మ‌రింత మెరుగుప‌ర‌చుకున్నాడు.

సూర్య ఖాతాలో ప్ర‌స్తుతం 865 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో పాకిస్తాన్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ఉన్నాడు. అత‌డి ఖాతాలో 787 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య 78 పాయింట్ల వ్య‌త్యాసం ఉంది. ద‌క్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్ ఆడ‌ని రుతురాజ్ గైక్వాడ్ ఏడో స్థానంలోనే కొన‌సాగుతున్నాడు. టీమ్ఇండియా న‌యా హిట్ట‌ర్ రింకూ సింగ్ రెండో టీ20లో మెరుపు అర్ధ‌శ‌త‌కాన్ని చేయ‌డంతో ఏకంగా 46 స్థానాలు మెరుగుప‌ర‌చుకున్నాడు. 59వ స్థానానికి చేరుకోగా, తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ సైతం 10 స్థానాలు మెరుగుప‌ర‌చుకుని 55వ స్థానానికి చేరుకున్నాడు.

Tom Curran : మంట‌ను చూసి భ‌య‌ప‌డిన స్టార్ ఆల్‌రౌండ‌ర్‌..! కొద్దిలో మిస్సైంది మామా..!

బిష్ణోయ్ నంబ‌ర్ వ‌న్‌..

టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యువ స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ త‌న అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. రెండో టీ20 మ్యాచులో ఆడ‌న‌ప్ప‌టికీ అత‌డి ర్యాంకింగ్స్‌లో ఎలాంటి తేడా రాలేదు. అయితే.. అత‌డికి అఫ్గానిస్థాన్ స్టార్ ఆట‌గాడు ర‌షీద్ ఖాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. వీరిద్ద‌రి ఖాతాలో 692 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బిష్ణోయ్ మిన‌హా మ‌రే భార‌త బౌల‌ర్ కూడా టాప్‌-10లో లేడు.

టాప్‌-10 బ్యాట‌ర్లు వీరే..

సూర్య‌కుమార్ యాద‌వ్ (భార‌త్‌) – 865 రేటింగ్ పాయింట్లు
మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (పాకిస్తాన్‌) – 787
ఐడెన్ మార్‌క్ర‌మ్ (ద‌క్షిణాఫ్రికా) – 758
బాబ‌ర్ ఆజాం (పాకిస్తాన్‌) – 734
రిలీ రోసోవ్ (ద‌క్షిణాఫ్రికా) – 695
డేవిడ్ మ‌ల‌న్ (ఇంగ్లాండ్‌) – 691
రుతురాజ్ గైక్వాడ్ (భార‌త్‌) – 681
రీజా హెండ్రిక్స్ (ద‌క్షిణాఫ్రికా) – 674
జోస్ బ‌ట్ల‌ర్ (ఇంగ్లాండ్‌) – 666
గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్‌) – 649

Gautam Gambhir : అలా ఎలా ప్ర‌పంచ నంబ‌ర్ 1 బౌల‌ర్‌ను ప‌క్క‌న బెట్టారు..? : గంభీర్‌

టాప్ -10 బౌల‌ర్లు వీరే..

ర‌వి బిష్ణోయ్ (భార‌త్‌) – 692 రేటింగ్ పాయింట్లు
ర‌షీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్‌) – 692
వానిందు హ‌స‌రంగా (శ్రీలంక‌) – 679
ఆదిల్ ర‌షీద్ (ఇంగ్లాండ్‌) – 679
మ‌హేశ్ తీక్ష‌ణ (శ్రీలంక‌) – 677
సామ్ క‌ర‌న్ (ఇంగ్లాండ్‌) – 659
ఫజల్హక్ ఫారూఖీ (అఫ్గానిస్థాన్‌) – 657
ముజీబ్ ఉర్ రెహమాన్ (అఫ్గానిస్థాన్‌) – 656
అకేల్ హోసేన్ (వెస్టిండీస్) – 655
తబ్రైజ్ షమ్సీ (ద‌క్షిణాఫ్రికా) – 654