ICC U19 World Cup 2020: భారత్ మ్యాచ్‌లు ఎప్పుడో తెలుసా

డిఫెండింగ్ చాంపియన్స్ ఇండియా.. అండర్ 19 వరల్డ్ కప్‌ని ఐదో సారి దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19నుంచి కాంపైన్ మొదలుకానుంది. నాలుగు సార్లు కప్ గెలిచిన విశ్వ విజేత.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఫార్మాట్ నుంచి వచ్చినవాడే. కోహ్లీనే కాదు రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా వీరంతా అండర్ 19జట్టు నుంచే సీనియర్ టీంలో భాగమయ్యారు.
ఇదిలా ఉంటే అండర్ 19టోర్నీ మొదలవడానికి ముందే కొద్ది మంది ప్లేయర్లు ఫేమస్ అయిపోయారు. ఐపీఎల్ 2020వేలంలో ప్రియం గార్గ్ రూ.1.9కోట్లు పలికి సంచలనంగా మారాడు. ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రవి బిష్ణోయ్‌ను రూ.2కోట్లకు సొంతం చేసుకుని గ్రేట్ అనిపించుకున్నాడు. యశస్వి జైస్వాల్ పానీ పూరీలు అమ్మి అండర్ 19జట్టులో చోటు దక్కించుకున్న విజయగాథతో మనసులు గెలుచుకున్నాడు.
కొద్ది రోజుల్లో మొదలుకానున్న అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో గ్రూప్ ఏలో భాగమైన భారత్.. తమ సత్తా నిరూపించుకోవాల్సి ఉంది. తొలి మ్యాచ్ లో శ్రీలంకతో తలపడుతుంది. సెప్టెంబర్ లో జరిగిన అండర్ 19ఆసియా కప్ టోర్నమెంట్ లో భారత్ విజేతగా నిలిచింది. దాంతో పాటు ఇంగ్లీష్ గడ్డపై జరిగిన ముక్కోణపు టోర్నమెంట్ లోనూ ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ లపై గెలిచింది.
మొదటి మ్యాచ్:
తేదీ: జనవరి 19
సమయం: మధ్యాహ్నం 1.30గంటలకు
మ్యాచ్: India U19 vs Sri Lanka U19, 7th Match, Group A
వేదిక: Mangaung Oval, Bloemfontein
రెండో మ్యాచ్:
Date: జనవరి 21
సమయం: మధ్యాహ్నం 1.30గంటలకు
మ్యాచ్: India U19 vs Japan U19, 11th Match, Group A
వేదిక: Mangaung Oval, Bloemfontein
మూడో మ్యాచ్:
సమయం: మధ్యాహ్నం 1.30గంటలకు
మ్యాచ్: India U19 vs New Zealand U19, 20th Match, Group A
వేదిక: Mangaung Oval, Bloemfontein
ఫైనల్ మ్యాచ్:
సమయం: ఫిబ్రవరి 03, 2020
మ్యాచ్: Final
వేదిక: Senwes Park, Potchefstroom
Squad:
India U19 squad: Priyam Garg (c), Yashasvi Jaiswal, Tilak Varma, Divyaansh Saxena, Dhruv Chand Jurel (vc), Shashwat Rawat, Siddhesh Veer, Shubhang Hegde, Ravi Bishnoi, Akash Singh, Kartik Tyagi, Atharva Ankolekar, Kumar Kushagra, Sushant Mishra, Vidyadhar Patil