ICC World Cup 2023 : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌కు బీసీసీఐ ‘గోల్డెన్ టికెట్‌’

అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు భార‌త దేశంలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World cup) జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) గోల్డెన్ టికెట్ ఫ‌ర్ ఇండియా ఐకాన్స్ పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది.

ICC World Cup 2023 : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌కు బీసీసీఐ ‘గోల్డెన్ టికెట్‌’

Golden ticket to Rajnikanth

Updated On : September 19, 2023 / 3:48 PM IST

ICC World Cup : అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు భార‌త దేశంలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World cup) జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ‘గోల్డెన్ టికెట్ ఫ‌ర్ ఇండియా ఐకాన్స్’ పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఇందులో భాగంగా మొద‌టి టికెట్‌ను బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌కు అందించ‌గా రెండో టికెట్‌ను క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్‌ల‌కు అంద‌జేశారు. ఇక ఇప్పుడు ద‌క్షిణాది సూప‌ర్ స్టార్, త‌మిళ న‌టుడు త‌లైవా ర‌జినీకాంత్‌ కు గోల్డెన్ టికెట్ (Golden Ticket) ను అంద‌జేశారు.

బీసీసీఐ సెక్రటరీ జై షా స్వయంగా ర‌జినీకాంత్‌కు ఈ ఈ గొల్డెన్ టికెట్‌ను అందించారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్ల‌డించింది. “చ‌రిష్మా, సినిమా యొక్క నిజ‌మైన ప్ర‌కాశం అయిన న‌టుడు రజనీకాంత్‌కు బీసీసీఐ సెక్రటరీ జైషా గోల్డెన్ టికెట్ అందించారు. దిగ్గ‌జ న‌టుడు.. భాష మ‌రియు సంస్కృతికి అతీతంగా ల‌క్ష‌లాది మంది హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేశారు. త‌లైవాను వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు విశిష్ట అతిథిగా ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి మెగా టోర్నీకి ఆయ‌న హాజరవుతారని, క్రికెట్ అభిమానులను మరింత అలరిస్తారని ఆశిస్తున్నాం.”అని బీసీసీఐ ట్వీట్ చేసింది. ర‌జినీకాంత్‌కు జై షా గోల్డెన్ టికెట్ ఇస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది.

గోల్డెన్ టికెట్ ఉప‌యోగం ఏంటంటే..?

గోల్డెన్‌ టికెట్‌తో ప్ర‌పంచ‌క‌ప్ 2023లోని అన్ని మ్యాచుల‌ను వీఐపీ స్టాండ్ నుంచి ఉచితంగా చూసే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు అమితాబ్ బ‌చ్చ‌న్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌, రజినీకాంత్‌లు గోల్డెన్ టికెట్లు అందుకున్న వారిలో ఉన్నారు. ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభ‌మ‌య్యే లోపు మ‌రికొంత మందికి బీసీసీఐ గోల్డెన్ టికెట్‌ను ఇచ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌పంచ‌క‌ప్ కోసం మొత్తం 10 జ‌ట్లు పోటీ ప‌డ‌నున్నాయి. భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో అక్టోబ‌ర్ 8న ఆడ‌నుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసే భార‌త్‌, పాకిస్తాన్ ల మ‌ధ్య మ్యాచ్ అక్టోబ‌ర్ 14న జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

జైల‌ర్‌తో సాలీడ్ హిట్‌..

జైల‌ర్ సినిమాతో ర‌జినీకాంత్ సాలీడ్ హిట్ అందుకున్నాడు. ప్ర‌పంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.650 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రోబో 2.0 త‌రువాత అత్యంత వేగంగా రూ.600 కోట్ల క్ల‌బ్‌లో చేరిన రెండో త‌మిళ చిత్రంగా నిలిచింది. నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా, యోగిబాబు, శివ రాజ్‌కుమార్‌, మోహ‌న్ లాల్ లు కీల‌క పాత్ర‌లో న‌టించారు. స‌న్ పిక్చ‌ర్స్ ఈ సినిమాని నిర్మించ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించాడు.

IND vs AUS : ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌.. అశ్విన్‌కు చోటు.. భారత‌ జట్టు ఇదే..