Virat Kohli Funny Video: ప్రాక్టీస్ సెషన్ లో విరాట్ కోహ్లీ ఫన్నీ వీడియో వైరల్.. వాటర్ బాయ్ తరహాలో..
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు గతంలో కోహ్లీ వీడియోను షేర్ చేస్తున్నారు. ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్ లో కోహ్లీ

Virat Kohli
Virat Kohli : టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఉన్నాడంటే సందడిగా ఉంటుంది. విచిత్రమైన ప్రవర్తనతో కోహ్లీ నవ్వులు పూయిస్తుంటాడు. తోటి క్రీడాకారులను అనుకరిస్తూ ఆటపట్టిస్తుంటాడు. ఇలాంటి వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా విరాట్ కోహ్లీ ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇండియా వేదికగా వరల్డ్ కప్ 2023 జరుగుతుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఈనెల 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా శుక్రవారం భారత జట్టు ప్రాక్టీస్ లో నిమగ్నమైంది. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా విరాట్ కోహ్లీ ఫన్నీ రన్ తో కనిపించాడు. కాళ్లకు ఫ్యాడ్స్ కట్టుకొని మైదానంలోకి వస్తున్న క్రమంలో విరాట్ కోహ్లీ ఫన్నీ రన్ తో రావటం కనిపించింది. ఆ సమయంలో నెట్స్ లో బుమ్రాతో పాటు శార్డూల్ ఠాకూర్, మహ్మద్ షమీ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో లో బుమ్రాతో కోహ్లీ ఫన్నీ వ్యాఖ్యలు చేస్తూ కనిపించాడు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు గతంలో కోహ్లీ వీడియోను షేర్ చేస్తున్నారు. ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్ లో కోహ్లీ వాటర్ బాయ్ గా కనిపించాడు. ఆ సమయంలో విచిత్రమైన పరుగుతో వాటర్ బాటిల్స్ తో కోహ్లీ మైదానంలోకి పరుగు పెట్టుకుంటూ వచ్చాడు. అదే తరహాలో ప్రస్తుతం వీడియో ఉండటంతో నెటిజన్లు పాత వీడియోను షేర్ చేస్తూ ‘సేమ్ ఎనర్జీ’ అంటూ ట్వీట్ చేస్తున్నారు.
Same Energy pic.twitter.com/dtxRyYDBbf
— BB (@BiggBoss1314) October 6, 2023