ILT20 : ఇంట‌ర్నేష‌న‌ల్ లీగ్ టీ20 ఫైన‌ల్‌.. విజేత ఎవ‌రో.. ?

ఇంట‌ర్నేష‌న‌ల్ లీగ్ (ILT20) టీ20 నాలుగో సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్ ఆదివారం దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

ILT20 : ఇంట‌ర్నేష‌న‌ల్ లీగ్ టీ20 ఫైన‌ల్‌.. విజేత ఎవ‌రో.. ?

ILT20 season 4 Final match today MI Emirates vs Desert Vipers

Updated On : January 4, 2026 / 4:09 PM IST

ILT20 : ఇంట‌ర్నేష‌న‌ల్ లీగ్ టీ20  నాలుగో సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. దుబాయ్ వేదిక‌గా నేడు (జ‌న‌వ‌రి 4 ఆదివారం) ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. సామ్ క‌ర‌న్ సార‌థ్యంలోని డెజర్ట్ వైపర్స్ కీర‌న్ పొలార్డ్ నాయ‌క‌త్వంలోని ఎంఐ ఎమిరేట్స్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తొలి సారి క‌ప్పును అందుకోవాల‌ని డెజ‌ర్ట్ త‌హ‌త‌హ‌లాడుతోంది. మ‌రోవైపు ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి రెండో సారి క‌ప్పును ముద్దాడాల‌ని ముంబై ఆరాట‌ప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలో ఫైన‌ల్ మ్యాచ్ హోరా హోరీగా సాగే అవ‌కాశం ఉంది. భార‌త కాల‌మానం ప్రకారం రాత్రి 8 గంట‌ల‌కు దుబాయ్‌లోని దుబాయ్ అంత‌ర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కాగా.. మ్యాచ్ ముందు నిర్వ‌హించిన విలేక‌రులో స‌మావేశంలో ఇరు జ‌ట్ల కెప్టెన్లు మాట్లాడారు.

Sneh Rana : టీమ్ఇండియా ప్లేయ‌ర్‌కు ముద్దు పెడుతున్న బాలీవుడ్ న‌టి.. ఫోటోలు వైర‌ల్‌..

వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ల కంటే జ‌ట్టు విజ‌యం సాధించ‌డం చాలా ముఖ్యం అని డెజ‌ర్ట్ వైప‌ర్స్ కెప్టెన్ సామ్ క‌ర‌న్ తెలిపాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు తాము అద్భుతంగా ఆడామ‌ని, ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ అదే కొన‌సాగిస్తామ‌న్న ధీమాను వ్య‌క్తం చేశాడు. ఫైన‌ల్ అంటే ఒత్తిడి ఉంటుంద‌ని, దాన్ని అధిగ‌మించిన జ‌ట్టు విజేత‌గా నిలుస్తుంద‌న్నాడు. తాము తొలిసారి ఫైన‌ల్ కు వ‌చ్చామ‌ని అయిన‌ప్ప‌టికి కూడా తాము విజ‌యం కోసం పోరాడ‌తామ‌న్నాడు.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం బంగ్లాదేశ్ జ‌ట్టు ఇదే.. ముస్తాఫిజుర్ కు చోటు..

తాము ఇప్ప‌టికే ఓ సారి విజేత‌గా నిలిచామ‌ని, ఫైన‌ల్ ఎలా ఆడాల‌నే విష‌యం పై పూర్తి అవ‌గాహ‌న ఉంద‌ని ఎంఐ కెప్టెన్ కీర‌న్ పొలార్డ్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో అండ‌ర్ డాగ్‌లు బ‌రిలోకి దిగ‌డంపై స్పందిస్తూ అది త‌మ‌పై ఒత్తిడి త‌గ్గిస్తుంద‌న్నాడు. ఫైన‌ల్ అంటే ఒత్తిడి ఉంటుంద‌ని, తాము ప్ర‌శాంత ఉంటూ ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమ‌లు చేస్తే ఈ రాత్రి ఓ మధుర‌మైన రోజుగా మిగులుతుంద‌న్నాడు.