Hyderabad: గచ్చిబౌలిలో ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ప్రారంభం
భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించడం, దేశంలోని భవిష్యత్తు యువత కోసం క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు మార్గాలను బలోపేతం చేయడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, పుల్లెల గోపీచంద్ తో కలిసి పని చేస్తుంది. మా CSR ప్రయత్నాలు వారి ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్య, జీవనోపాధి, పర్యావరణం, క్రీడలను అందరికీ అందుబాటులో ఉంచడంపై దృష్టి పెడుతున్నాం

badminton training center
Hyderabad: బ్యాడ్మింటన్ లో ప్రపంచ స్థాయి శిక్షణా కేంద్రమైన “కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ” శనివారం హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ప్రారంభించారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ కలయికలో ఇది ఏర్పాటైంది. ఈ సందర్భంగా జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ అత్యాధునిక బ్యాడ్మింటన్ సెంటర్ క్రీడలపై కేఎంబీఎల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా బ్యాడ్మింటన్ రంగంలో భారతదేశానికి మరిన్ని అవార్డులను తీసుకురావడానికి మరింత కృషిచేస్తున్నామని అన్నారు. ఈ అంతర్రాష్ట్ర అకాడమీకి బ్యాంక్, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ భాగస్వామ్యంలో ఇది ఏర్పాటైందని అన్నారు. బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఔత్సాహిక, అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణను అందించడానికి అంతర్జాతీయ స్థాయి కోచ్‌లతో పాటు అధునాతన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను అందిస్తున్నామని తెలిపారు.
Rahul Gandhi: అధికారిక నివాసం తాళాలు అప్పగించి, ప్రజలకు థాంక్స్ చెప్పిన రాహుల్ గాంధీ
2019లో కోటక్ మహీంద్రా బ్యాంక్ భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ల కోసం ప్రపంచ స్థాయి శిక్షణా సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ (ఫౌండేషన్) భాగస్వామ్యంలో స్పోర్ట్స్‌లో తన సీఎస్ఆర్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ కొత్త శిక్షణా సౌకర్యాన్ని ప్రారంభించడం రెండు సంస్థలకు ఇది ముఖ్యమైన మైలురాయి, దేశంలో అసాధారణమైన అథ్లెట్లు, కోచ్‌లను అభివృద్ధి చేయాలనే వారి భాగస్వామ్య దృష్టిని సాధించే దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు.
ఇక ఈ విషయమై ఏకాంబరం మాట్లాడుతూ “భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించడం, దేశంలోని భవిష్యత్తు యువత కోసం క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు మార్గాలను బలోపేతం చేయడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, పుల్లెల గోపీచంద్ తో కలిసి పని చేస్తుంది. మా CSR ప్రయత్నాలు వారి ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్య, జీవనోపాధి, పర్యావరణం, క్రీడలను అందరికీ అందుబాటులో ఉంచడంపై దృష్టి పెడుతున్నాం’’ అని అన్నారు.