ICC U19 World Cup 2022: రికార్డ్ సృష్టించిన ఇండియా యువకెరటాలు.. 405/5

U19 ప్రపంచ కప్ టోర్నీలో ఇండియా యువ ఆటగాళ్లు రికార్డ్ సృష్టించారు. ఉగాండాతో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా U19 జట్టు దుమ్మురేపింది.

ICC U19 World Cup 2022: రికార్డ్ సృష్టించిన ఇండియా యువకెరటాలు.. 405/5

Icc U19 World Cup 2022

Updated On : January 22, 2022 / 10:56 PM IST

ICC U19 World Cup 2022: U19 ప్రపంచ కప్ టోర్నీలో ఇండియా యువ ఆటగాళ్లు రికార్డ్ సృష్టించారు. ఉగాండాతో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా U19 జట్టు దుమ్మురేపింది. మొత్తం 50 ఓవర్లను నిలకడగా అడిగిన భారత్ 5 వికెట్ల నష్టానికి ఏకంగా 405 పరుగులు చేసింది.

భారత ఆటగాళ్లలో రాజ్ బవ 108 బంతులలో 162 పరుగులతో చెలరేగిపోయాడు. మొత్తం 14 ఫోర్లు, 8 సిక్సర్లతో స్టేడియం మోత మోగించాడు రాజ్ బవ. ఆ తర్వాత రఘువంశీ కూడా రాజ్ బవతో పోటీ పడ్డాడు. కేవలం 120 బంతులలోనే రఘువంశీ 144 పరుగులు చేశాడు. ఇందులో 22 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయంటే రఘు ఆడిన తీరుని ఊహించుకోవచ్చు.

అండర్ 19 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే రెండో అత్యధిక స్కోర్ కాగా తొలి అత్యధిక స్కోర్ రికార్డ్ కూడా ఇండియాకు సొంతం. గతంలో 2004లో స్కాట్లాండ్ మీద అండర్ 19 టీం ఇండియా 425/3 పరుగులు చేసింది.