వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. టీమిండియా సునాయాస విజయం
ఇంగ్లాండ్ బౌలర్లలో ఫ్రెంచ్ 2, జాక్ హోమ్, రాల్ఫీ అల్బెర్ట్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.

ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న భారత అండర్-19 జట్టు శుక్రవారం జరిగిన తొలి వన్డేలో సత్తా చాటింది. 156 బంతులు మిలిగి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. టీమిండియా ధాటికి 42.2 ఓవర్లలోనే 174 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో డాకిన్స్ 18, ఐజాక్ మోహమ్మద్ 42, బెన్ మేస్ 16, రాకీ ఫ్లింటాఫ్ 56, థామస్ రీవ్ 5, జోసఫ్ మూర్ 9,రాల్ఫీ ఆల్బర్ట్ 5, జాక్ హోమ్ 5, జేమ్స్ మింటో 10, తాజీమ్ చౌద్రి అలి 1, ఏఎం ఫ్రెంచ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.
లక్ష్య ఛేదనలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించాడు. 5 సిక్సులు, మూడు ఫోర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. ఆయుశ్ మాత్రే కూడా చక్కగా రాణించాడు. 30 బంతుల్లో 21 పరుగులు చేశాడు.
అభిజ్ఞాన్ కుందు 34 బంతుల్లో 45 (నాటౌట్)తో రాణించాడు. దీంతో భారత్ 24 ఓవర్లలో 178/4 స్కోరు చేసి సునాయసంగా గెలిచింది. 5 వన్డేల సిరీస్‌లో భారత జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో ఫ్రెంచ్ 2, జాక్ హోమ్, రాల్ఫీ అల్బెర్ట్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. కాగా, రెండో వన్డే సోమవారం జరుగుతుంది. ఐదు వన్డేల సిరీస్ తర్వాత రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఉంటాయి. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లోనూ వైభవ్ సూర్యవంశీ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆయుష్ మాత్రే భారత టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.