IND vs AUS 1st Test : పెర్త్ టెస్టులో టాస్ గెలిచిన భారత్ జట్టు.. నితీశ్ రెడ్డికి తుది జట్టులో చోటు

బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. పెర్త్ లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ..

IND vs AUS 1st Test : పెర్త్ టెస్టులో టాస్ గెలిచిన భారత్ జట్టు.. నితీశ్ రెడ్డికి తుది జట్టులో చోటు

IND vs AUS 1st Test

Updated On : November 22, 2024 / 8:02 AM IST

Border-Gavaskar Trophy: బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. పెర్త్ లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి తుది జట్టులో అవకాశం దక్కింది. దీంతో నితీశ్ రెడ్డి టెస్టు క్రికెట్ లోకి అరంగ్రేటం చేయబోతున్నాడు. నితీశ్ రెడ్డితోపాటు హర్షిత్ రాణా కూడా ఈ మ్యాచ్ ద్వారా టస్టు ఫార్మాట్ లోకి అరంగ్రేటం చేయబోతున్నాడు. వీరితోపాటు దేవ్ దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ లకు తుది జట్టులో చోటు దక్కింది.

Also Raed: IND vs AUS: పెర్త్‌ టెస్టులో టాసే కీలకం.. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుదే విజయమా? గణాంకాలు ఇలా..

బుమ్రా నాయకత్వం వహిస్తున్న ఈ జట్టులో కీలక నిర్ణయం తీసుకున్నారనే చెప్పొచ్చు. సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. జడేజా, అశ్విన్ లను కాదని స్పిన్ ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులో ఎంపిక చేశారు. నితీశ్ కుమార్ పేస్ ఆల్ రౌండర్ గా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. తుది జట్టు ఎంపికను బట్టి చూస్తే.. పెర్త్ స్టేడియం ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఇద్దరు సీనియర్ స్పినర్లను బుమ్రా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ తో తుది జట్టును ఎంపిక చేశారు. శుభ్ మన్ గిల్ ఎడమచేతి బొటనవేలికి గాయం కారణంగా అతన్ని తుది జట్టులోకి తీసుకోలేదు. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో సెంచరీతో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ కు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ కు తుది జట్టులో అవకాశం దక్కింది.

టాస్ గెలిచిన తరువాత బుమ్రా మాట్లాడుతూ.. మేము మొదట బ్యాటింగ్ చేయబోతున్నాం. మేము విజయం సాధిస్తామని చాలా నమ్మకంతో ఉన్నాం. మేము 2018లో ఇక్కడ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాము. కాబట్టి ఈ పిచ్ పై ఏ విధంగా ఆడాలో మాకు అవగాహన ఉందని అన్నాడు.

Also Read: Virender Sehwag : వీరేంద్ర‌ సెహ్వాగ్ కొడుకు డబుల్ సెంచరీ.. 34 ఫోర్లు, 2 సిక్స‌ర్లు.. తండ్రిబాట‌లోనే..!

భారత్ జట్టు :
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్ దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, జస్ర్పీత్ బుమ్రా (కెప్టెన్).

ఆస్ట్రేలియా జట్టు :
ఖవాజా, మెక్ స్వీని, లుబుషేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), లైయన్, హేజిల్ వుడ్.