IND vs AUS 2nd T20I : రెండో టీ20కి ముందు భార‌త అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌..

India vs Australia 2nd T20I : ఆదివారం తిరువ‌నంత‌పురంలో ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.

IND vs AUS 2nd T20I : రెండో టీ20కి ముందు భార‌త అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌..

IND vs AUS 2nd T20I

Updated On : November 25, 2023 / 9:26 PM IST

విశాఖ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్‌లో ఉంది టీమ్ఇండియా. అదే ఉత్సాహంలో రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధ‌మైంది. ఆదివారం తిరువ‌నంత‌పురంలో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో త‌మ ఆధిక్యాన్ని పెంచుకోవాల‌ని భార‌త జ‌ట్టు భావిస్తుండ‌గా ఆసీస్ మాత్రం సిరీస్ స‌మం చేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్ సైతం హోరాహోరీగా జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో క్రికెట్ అభిమానుల‌కు ఓ బ్యాడ్‌న్యూస్ ఇది. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. మ్యాచ్ జ‌ర‌గ‌నున్న గ్రీన్ ఫీల్డ్ మైదానంలో గ‌త కొద్ది రోజులుగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్త‌డిగా మారింది. దీంతో శ‌నివారం ఇరు జ‌ట్లు ప్రాక్టీస్ కూడా చేయ‌లేక‌పోయాయి. ఇక ఆదివారం భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అక్యూవెదర్ రిపోర్ట్‌ ప్రకారం మ్యాచ్ జ‌ర‌గ‌నున్న స‌మ‌యంలో 55 శాతం వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

Rahul Dravid : ఐపీఎల్‌లోకి రాహుల్ ద్ర‌విడ్ రీ ఎంట్రీ..? ఆ జ‌ట్టుకు మెంటార్‌గా..?

కాగా.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023కి ముందు ఈ మైదానంలో జ‌ర‌గాల్సిన వార్మ‌ప్ మ్యాచులు సైతం వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయ్యాయి.

పిచ్ రిపోర్టు..

ఈ మైదానంలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు టీ20 మ్యాచులు జ‌రిగాయి. ఇక్క‌డ రెండో సారి బ్యాటింగ్ చేయ‌డం ఉత్త‌మం. ఈ క్ర‌మంలో టాస్ గెలిచిన జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవ‌కాశం ఉంది.

తుది జట్ల అంచనా..

టీమ్ఇండియా : రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ

ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లీస్, మార్కస్ స్టొయినిస్, టీమ్ డేవిడ్, ఆరోన్ హార్దీ, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా

Derogatory post on Team India : విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌తో పాటు భార‌త క్రికెట‌ర్ల పై అవ‌మాన‌క‌ర పోస్ట్‌.. లైక్ కొట్టిన ఆసీస్ క్రికెట‌ర్లు