IND vs BAN : విజృంభించిన భార‌త బౌల‌ర్లు.. బంగ్లాదేశ్ 149 ఆలౌట్‌.. భార‌త్‌కు 227 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం

చెపాక్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న టెస్టు మ్యాచులో భార‌త్ ప‌ట్టు బిగిస్తోంది.

IND vs BAN : విజృంభించిన భార‌త బౌల‌ర్లు.. బంగ్లాదేశ్ 149 ఆలౌట్‌.. భార‌త్‌కు 227 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం

Chepauk test

Updated On : September 20, 2024 / 3:20 PM IST

చెపాక్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న టెస్టు మ్యాచులో భార‌త్ ప‌ట్టు బిగిస్తోంది. టీమ్ఇండియా బౌల‌ర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. దీంతో భార‌త్‌కు తొలి ఇన్నింగ్స్‌లో కీల‌క‌మైన 227 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.

బంగ్లాదేశ్ బ్యాట‌ర్ల‌లో షకీబ్ అల్ హసన్ (32), లిట‌న్ దాస్ (22), మెహిదీ హసన్ మిరాజ్ (27 నాటౌట్‌), నజ్ముల్ హుస్సేన్ శాంటో (20) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్‌, జ‌డేజా, సిరాజ్ లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

IND vs BAN : చెపాక్‌లో అశ్విన్ సెంచ‌రీ.. బామ్మ చేసిన ప‌నికి అంతా షాక్‌?

అంత‌క‌ముందు తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 376 ప‌రుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ (113; 133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేశాడు. ర‌వీంద్ర జడేజా (86; 124 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), య‌శ‌స్వి జైస్వాల్ (56; 118 బంతుల్లో 9 ఫోర్లు) లు హాఫ్ సెంచ‌రీలు సాధించారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో హ‌స‌న్ మ‌హ‌మూద్ 5 వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు, నహిద్ రానా, మెహిదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.