IND vs ENG: బుమ్రాతో అట్లే ఉంటది మరి..! ఇంగ్లాండ్ ఓపెనర్లకు మైండ్ బ్లాకైంది.. వీడియో వైరల్

రెండోరోజు ఆట పూర్తయ్యే సరికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. అయితే, ఆ మూడు వికెట్లను జస్ర్పీత్ బుమ్రానే పడగొట్టాడు.

IND vs ENG: బుమ్రాతో అట్లే ఉంటది మరి..! ఇంగ్లాండ్ ఓపెనర్లకు మైండ్ బ్లాకైంది.. వీడియో వైరల్

Jasprit Bumrah

Updated On : June 22, 2025 / 9:25 AM IST

IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ టెస్టులో భాగంగా రెండోరోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీమిండియాను 471 పరుగులకు ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. ఆ తరువాత బ్యాటింగ్ లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే, ఇంగ్లాండ్ బ్యాటర్లను టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా హడలెత్తించాడు. ముఖ్యంగా రాకెట్ వేగంతో దూసుకొచ్చే బంతులతో ఓపెనర్లకు చుక్కలు చూపించాడు.

Also Read: IND vs ENG: అరెరే.. టీమిండియా కొంపముంచిన రవీంద్ర జడేజా.. సింపుల్ క్యాచ్‌ మిస్.. వీడియో వైరల్

రెండోరోజు ఆట పూర్తయ్యే సరికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. అయితే, ఆ మూడు వికెట్లను జస్ర్పీత్ బుమ్రానే తీశాడు. అద్భుతమైన బౌలింగ్ తో జాక్ క్రాలీ (4), బెన్ డకెట్ (62), రూట్ (28)లను పెవిలియన్ బాట పట్టించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ లను బుమ్రా హడలెత్తించాడు.


తొలి ఓవర్‌లోనే క్రాలీని జస్ర్పీత్ బుమ్రా బోల్తా కొట్టించాడు. క్రాలీ క్రీజులో ఉన్నాడు.. మొదటి ఓవర్‌లో ఐదో బంతిని బుమ్రా మిడిల్ స్టంప్‌పై అవుట్-స్వింగర్ వేశాడు. క్రాలీ ఆ బంతిని లెగ్‌సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్‌లో కరుణ్ నాయర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో 4 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఓపెనర్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.


మరోవైపు.. బుమ్రా బౌలింగ్ తో ఇబ్బందిపడ్డ డకెట్.. రెండు సార్లు క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. చివరికి బుమ్రా వేసి అద్భుమైన బంతికి డకెట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఔట్ అయిన తరువాత డకెట్ వికెట్ల వైపు అలానే చూస్తుండిపోయాడు. వెంటనే తేరుకొని నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు.