IND vs ENG 4th T20I : ఇంగ్లాండ్ లక్ష్యం 186.. కోహ్లీసేన సిరీస్ సమం చేసేనా?

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టుకు 186 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

IND vs ENG 4th T20I : ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టుకు 186 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఆటగాళ్లలో సూర్య కుమార్ యాదవ్ (31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్) 57 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

శ్రేయస్ అయ్యర్ (37), రిషబ్ పంత్ (30) పర్వాలేదనిపించగా.. కేఎల్ రాహుల్ (12), రోహిత్ శర్మ (12), హార్దిక్ పాండ్యా (11), వాషింగ్టన్ సుందర్ (4) పరుగులకే ఒక్కొక్కరిగా పెవిలియన్ చేరారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక పరుగుతోనే స్టంప్ ఔట్ గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్ మెన్ వికెట్లు టపాటపా పడిపోయాయి. 20 ఓవర్లు ముగిసేసరికి శార్దూల్ ఠాకూర్ (10 నాటౌట్), భువనేశ్వర్ కుమార్ (0, నాటౌట్)గా ఉన్నారు.

భారత్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసి.. ప్రత్యర్థి జట్టుకు 186 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ (4/33) నాలుగు వికెట్లు తీసుకోగా.. రషీద్, వుడ్, స్టోక్స్, కరన్ తలో వికెట్ తీసుకున్నారు.

మూడో టీ20లో పర్యాటక ఇంగ్లండ్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కోహ్లీసేన సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిరీస్‌లో 1-2తో భారత్‌ వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.

ట్రెండింగ్ వార్తలు