IND vs NZ: రెండో టెస్టు తొలి రోజు టైమింగ్స్ మార్పు

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో భాగంగా జరగనున్న తొలి రోజు మ్యాచ్ టైమింగ్స్ లో మార్పులు జరిగాయి. ఉదయం 11గంటల 30నిమిషాలకు టాస్ పడగా.. 12గంటలకు మ్యాచ్ మొదలైంది.

IND vs NZ: రెండో టెస్టు తొలి రోజు టైమింగ్స్ మార్పు

Ind Vs Nz

Updated On : December 3, 2021 / 12:15 PM IST

IND vs NZ: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో భాగంగా జరగనున్న తొలి రోజు మ్యాచ్ టైమింగ్స్ లో మార్పులు జరిగాయి. ఉదయం 11గంటల 30నిమిషాలకు టాస్ పడగా.. 12గంటలకు మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. దాదాపు 2గంటల 40నిమిషాల పాటు సమయం కోల్పోయారు. టీ బ్రేక్ లో భాగంగా మధ్యాహ్నం 2గంటల 40నిమిషాల నుంచి 3గంటల వరకూ విరామం ఉంటుంది.

సెకండ్ సెషన్ మధ్యాహ్నం 3గంటలకు మొదలవుతుంది. సాయంత్రం 5గంటల 30నిమిషాల వరకూ మ్యాచ్ జరగనుండగా.. మొత్తం రోజులో 78ఓవర్ల పాటు ఆడతారు.

టీమిండియా, న్యూజిలాండ్ ఇరు జట్లను గాయాలబెడద వేదిస్తుంది. ఇండియా జట్టులో అజింకా రహానె, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ రెండో టెస్టు నుంచి తప్పుకున్నారు. కివీస్ టీంలో కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ మ్యాచ్ కు దూరమయ్యారు. తొలి టెస్టు డ్రాగా ముగియగా చివరి మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారనుంది. తొలి మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు.

………………………………………..: ఒమిక్రాన్ భయం..టెస్టుల పేరిట దోపిడీ!