IND vs PAK : మళ్లీ వరుణుడి ఎంట్రీ.. రేపటికి మ్యాచ్ వాయిదా
ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికైంది.

IND vs PAK
ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
LIVE NEWS & UPDATES
-
రిజర్వ్ డేకు మ్యాచ్
మ్యాచ్ నిర్వహణకు మైదానాన్ని సిద్ధం చేయగా మరోసారి వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా వేశారు. రేపు మధ్యాహ్నాం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత ఇన్నింగ్స్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే మ్యాచ్ మొదలుకానుంది.
On to the reserve day ?
India will resume their innings tomorrow as persistent rain has put a halt on proceedings ?#AsiaCup2023 | #INDvPAK | ?: https://t.co/01BrLxunr3 pic.twitter.com/sDwzdRGtuC
— ICC (@ICC) September 10, 2023
-
మళ్లీ వర్షం పడుతోంది..
మ్యాచ్ నిర్వహణకు మైదానాన్ని సిద్ధం చేయగా మరోసారి వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం కురుస్తుండడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.
-
8.30 గంటలకు మరోసారి మైదానాన్ని పరిశీలించనున్న అంపైర్లు
అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. తడిగా ఉన్న చోట ఇసుక వేశారు. ఆ ప్రాంతాల్లో ఇంకా తడిగా ఉండడంతో మైదాన సిబ్బంది ఫ్యాన్లతో ఆరబెడుతున్నారు. 8.30 గంటల సమయంలో మరోసారి అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించనున్నారు.
-
8 గంటలకు మైదానాన్ని పరిశీలించనున్న అంపైర్లు
వర్షం నిలిచిపోవడంతో 7.30 గంటల సమయంలో అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. అయితే.. పలు చోట్ల వర్షం నీరు నిలిచి ఉంది. ఆ నీటీని తొలగించేందుకు గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో 8 గంటల సమయంలో మరోసారి మైదానాన్ని అంపైర్లు పరిశీలించనున్నారు.
-
ఆగిన వర్షం
వర్షం ఆగిపోయింది. మైదాన సిబ్బంది కవర్లను తొలగిస్తున్నారు. 6.22 pm తరువాత నుంచి ఓవర్ల కుదింపు ఉండే అవకాశం ఉంది. అంపైర్లు మైదానాన్ని పరిశీలించిన తరువాత మ్యాచ్‌ను ఎప్పుడు మొదలు పెట్టనున్నారు అనే విషయం తెలియనుంది.
-
మ్యాచ్‌కు వర్షం అంతరాయం
అనుకున్నట్లుగానే వరుణుడు వచ్చేశాడు. 24.1 ఓవర్ల ఆట పూర్తి అయిన తరువాత వర్షం మొదలైంది. ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. గ్రౌండ్ సిబ్బంది మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. 24.1వ ఓవర్లకు భారత స్కోరు 147/2. కేఎల్ రాహుల్ (17), విరాట్ కోహ్లి (8) లు క్రీజులో ఉన్నారు.
-
నెమ్మదించిన స్కోరు
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడడంతో భారత స్కోరు వేగం నెమ్మదించింది. రాహుల్, కోహ్లీలు ఆచితూచి ఆడుతున్నారు. గత రెండు ఓవర్లలో ఐదు పరుగులే వచ్చాయి. 22 ఓవర్లకు భారత స్కోరు 140/2. కేఎల్ రాహుల్ (9), కోహ్లి (5)లు క్రీజులో ఉన్నారు.
-
స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు రోహిత్, గిల్ ఔట్
భారత జట్టుకు స్వల్ప వ్యవధిలో రెండు షాకులు తగిలాయి. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్లు రోహిత్ శర్మ (56; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభ్ మన్ గిల్ (58; 52 బంతుల్లో 10 ఫోర్లు) ఔటైయ్యారు. షాదాబ్ ఖాన్ బౌలింగ్(16.4వ ఓవర్)లో ఫహీమ్ అష్రఫ్ క్యాచ్ అందుకోవడంతో రోహిత్ పెవిలియన్ చేరగా, షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో(17.5వ ఓవర్)లో అఘా సల్మాన్ చేతికి గిల్ చిక్కాడు. దీంతో 123 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లకు భారత స్కోరు 124/2. కేఎల్ రాహుల్(1), విరాట్ కోహ్లి(2) లు క్రీజులో ఉన్నారు.
-
రోహిత్ అర్థశతకం
షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో(14.1వ ఓవర్)లో సిక్స్ కొట్టి రోహిత్ శర్మ 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లకు భారత స్కోరు 115/0. గిల్ (53), రోహిత్ శర్మ (55) లు క్రీజులో ఉన్నారు.
-
శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ
షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో(12.3వ ఓవర్)లో సింగిల్ తీసి 37 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో శుభ్‌మన్ గిల్ అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ ఈ ఓవర్‌లో చివరి మూడు బంతులను 6,6,4గా మలిచాడు. 13 ఓవర్లకు భారత స్కోరు 96/0. గిల్ (50), రోహిత్ శర్మ (44) లు క్రీజులో ఉన్నారు.
-
రోహిత్ శర్మ రెండు ఫోర్లు..
పదో ఓవర్‌ను నసీమ్ షా వేయగా 8 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు కొట్టాడు. 10 ఓవర్లకు భారత స్కోరు 61/0. గిల్ (41), రోహిత్ శర్మ (18) లు క్రీజులో ఉన్నారు.
-
గిల్ రెండు ఫోర్లు
ఎనిమిదో ఓవర్‌ను నసీమ్ షా వేయగా 9 పరుగులు వచ్చాయి. గిల్ ఈ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. 8 ఓవర్లకు భారత స్కోరు 47/0. గిల్ (35), రోహిత్ శర్మ (10) లు క్రీజులో ఉన్నారు.
-
మెయిడిన్ ఓవర్..
పాక్ యువ పేసర్ నసీమ్ షా తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. రోహిత్ శర్మకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా బంతులు వేశాడు. దీంతో ఆరో ఓవర్‌లో ఒక్క పరుగు రాలేదు.6 ఓవర్లకు భారత స్కోరు 37/0. గిల్ (25), రోహిత్ శర్మ (10) లు క్రీజులో ఉన్నారు.
-
మళ్లీ గిల్ 3 ఫోర్లు
షాహీన్ అఫ్రిదిని గిల్ టార్గెట్ చేశాడు. మరోసారి అతడి బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదాడు. దీంతో ఐదో ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు భారత స్కోరు 37/0. గిల్ (25), రోహిత్ శర్మ (10) లు క్రీజులో ఉన్నారు.
-
శుభ్‌మన్ గిల్ మూడు ఫోర్లు
మూడో ఓవర్‌ను షాహీన్ అఫ్రిది వేయగా 12 పరుగులు వచ్చాయి. శుభ్‌మన్ గిల్ మూడు ఫోర్లు బాదాడు. 3 ఓవర్లకు భారత స్కోరు 23/0. రోహిత్ శర్మ (10), శుభ్‌మన్ గిల్ (13) లు క్రీజులో ఉన్నారు.
-
దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ
టీమ్ఇండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. షాహీన్ అఫ్రిది వేసిన మొదటి ఓవర్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన రోహిత్, నసీమ్ షా వేసిన రెండో ఓవర్‌లో ఐదో బంతిని ఫోర్ గా మలిచాడు. 2 ఓవర్లకు భారత స్కోరు 11/0. రోహిత్ శర్మ (10), శుభ్‌మన్ గిల్ (1) లు క్రీజులో ఉన్నారు.
-
పాకిస్థాన్ తుది జట్టు
ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
-
భారత్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్