IND vs SL : పట్టు బిగుస్తున్న భారత్..లంక ఆలౌట్ అయ్యేనా
లంక ముందు 447 పరుగులను లక్ష్యంగా ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్, పంత్ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. పంత్ కేవలం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని..

India Vs Srilanka
Sri Lanka 28/1 At Stumps In Chase Of 447 : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. పింక్ బాల్ తో డే/నైట్ టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. లంక ముందు భారీ టార్గెట్ (447 పరుగులు)ను పెట్టింది టీమిండియా. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండడంతో.. 2022, మార్చి 14వ తేదీ సోమవారం లంకను ఆలౌట్‌ను చేసేందుకు భారత బౌలర్లు ప్రయత్నిస్తున్నారు. 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్.. 9 వికెట్లకు 303 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
Read More : Pink Ball Test : ముగిసిన రెండో రోజు ఆట.. శ్రీలంక ముందు భారీ టార్గెట్
దీంతో లంక ముందు 447 పరుగులను లక్ష్యంగా ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్, పంత్ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. పంత్ కేవలం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని భారత్ తరఫున వేగవంతమైన అర్ధ శతకం బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. లంక బౌలర్లలో జయవిక్రమ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఎంబుల్దేనియా మూడు, ధనంజయ డిసిల్వా, విశ్వ ఫెర్నాండో తలో వికెట్ తీశారు. అంతకుముందు 86 పరుగులకు 6 వికెట్లతో రెండో రోజు ఆట ప్రారంభించిన లంకను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. దీంతో లంక 23 పరుగులే చేసి ఆఖరి నాలుగు వికెట్లను కోల్పోయింది. 5 వికెట్లతో బుమ్రా అదరగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక ఒక వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 16, కరుణరత్నే 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. తిరిమన్నే డకౌట్ గా వెనుదిరిగాడు.
– భారత్ మొదటి ఇన్నింగ్స్ : 252
– శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ : 109
– భారత్ రెండో ఇన్నింగ్స్ : 303