Ind Vs WI 1st ODI (Photo : Google)
India Beats West Indies : వెస్టిండీస్ తో(West Indies) జరిగిన తొలి వన్డే(1st ODI) మ్యాచ్ లో భారత్(Team India) విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత జట్టులో ఓపెనర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 46 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
గిల్(7), సూర్యకుమార్ యాదవ్(19), హార్ధిక్ పాండ్యా(), రవీంద్ర జడేజా(16 నాటౌట్), శార్ధూల్ ఠాకూర్(1), రోహిత్ శర్మ(12నాటౌట్) పరుగులు చేశారు. 22.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 118 పరుగులు చేసింది. 5 వికెట్ల తేడాతో విండీస్ పై విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలోనే 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. పాండ్యా, ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. విండీస్ బ్యాటర్లలో షై హోప్ ఒక్కడే రాణించాడు. 45 బంతుల్లో 43 పరుగులు చేసి ఔటయ్యాడు.
వెస్టిండీస్ (West indies) టూర్‌లో భాగంగా టీమిండియా (Team India) తొలి వన్డే ఆడింది. బార్బడోస్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియాలోకి ముకేశ్ కుమార్ (Mukesh Kumar) ఆరంగ్రేటం చేశాడు.