IND vs ZIM : రెండో టీ20 మ్యాచ్.. టాస్ గెలిచిన జింబాబ్వే.. భారత్ బ్యాటింగ్.. తుది జట్టులో కీలక మార్పు..
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ (IND vs ZIM) ప్రారంభమైంది.
IND vs ZIM 2nd t20 team india first batting after Zimbabwe won the toss
IND vs ZIM : మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని జింబాబ్వే పట్టుదలగా ఉంది.
‘మేము ముందు బ్యాటింగ్ చేయబోతున్నాం. పిచ్ కాస్త భిన్నంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఉన్నంత తేమ లేదు. బ్యాటింగ్‌కు ఇది అద్భుతమైన పిచ్‌గా కనిపిస్తోంది. గత మ్యాచ్‌ను ఎప్పుడో వదిలివేశాం. ప్రస్తుత క్షణంపైనే మా దృష్టి ఉంది. విజయం కోసం మా శాయశక్తులా కృషి చేస్తాము. తుది జట్టులో ఓ మార్పు ఉంది. అశోక్ శర్మ స్థానంలో యశ్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. ‘అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
IND vs ZIM : భారత్, జింబాబ్వేల మధ్య రెండో టీ20 మ్యాచ్.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?
🚨 Toss Update 🚨
Zimbabwe won the toss and elected to field first in the 2nd T20I
Updates ▶️ https://t.co/Z8UUziVx8d#TeamIndia | #ZIMvIND pic.twitter.com/CeGlRg24qa
— BCCI (@BCCI) July 25, 2026
జింబాబ్వే తుది జట్టు..
బ్రియాన్ బెన్నెట్, బెన్ కుర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ
#TeamIndia‘s Playing XI for the 2nd T20I 🔽
Updates ▶️ https://t.co/Z8UUziVx8d
#ZIMvIND pic.twitter.com/KXedeQrr3V
— BCCI (@BCCI) July 25, 2026
భారత తుది జట్టు..
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్.
