Indias Biggest Win Margin: టెస్టుల్లో భారీ పరుగుల తేడాతో భారత్ సాధించిన అతిపెద్ద విజయాలు..

గతంలో టెస్టుల్లో భారత్ సాధించిన అతి పెద్ద విజయాలను ఓసారి పరిశీలిస్తే..

Indias Biggest Win Margin: టెస్టుల్లో భారీ పరుగుల తేడాతో భారత్ సాధించిన అతిపెద్ద విజయాలు..

Updated On : July 6, 2025 / 10:15 PM IST

Indias Biggest Win Margin: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపొందింది. ఇక ఎడ్జ్ బాస్టన్ లో భారత్ కు ఇదే తొలి టెస్ట్ విజయం. ఇలా పలు రికార్డులను టీమిండియా నెలకొల్పింది. గతంలో టెస్టుల్లో భారత్ సాధించిన అతి పెద్ద విజయాలను ఓసారి పరిశీలిస్తే..

2024లో రాజ్ కోట్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారత్ 434 పరుగుల తేడాతో గెలిచింది. 2021లో ముంబై వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 372 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఇక 2015లో ఢిల్లీ వేదికగా జరిగిన టెస్ట్ లో సౌతాఫ్రికాపై భారత్ 337 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. ఇక 2016లో ఇండోర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ 321 రన్స్ తేడాతో సౌతాఫ్రికాపై గెలుపొందింది. తాజాగా 2025లో బర్మింగ్ హమ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 336 రన్స్ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.

434 runs vs ENG, Rajkot, 2024
372 runs vs NZ, Mumbai, 2021
337 runs vs ENG, Birmingham, 2025*
337 runs vs SA, Delhi, 2015
321 runs vs NZ, Indore, 2016

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. 608 పరుగుల ప్రపంచ రికార్డ్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 271 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 336 రన్స్ భారీ తేడాతో విక్టరీ కొట్టింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్ లో 407 రన్స్ చేసింది. నాలుగో రోజు ఆటలో భారత్ రెండో ఇన్నింగ్స్ ను 427/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన భారత్.. రెండో ఇన్నింగ్స్ కలుపుకొని ఇంగ్లాండ్ కు 608 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో భారత బౌలర్ ఆకాశ్ దీప్ చెలరేగిపోయాడు. 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. కాగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత జట్టుకు ఇది తొలి టెస్టు విజయం కావడం విశేషం.

ఇక ఈ సిరీస్‌లో కెప్టెన్‌ గిల్‌ సెంచరీల మోత మోగిస్తున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో అదరగొట్టాడు.