Jasprit Bumrah : చ‌రిత్ర సృష్టించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. మొద‌టి భార‌త పేస‌ర్

టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Jasprit Bumrah : చ‌రిత్ర సృష్టించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. మొద‌టి భార‌త పేస‌ర్

Jasprit Bumrah

Bumrah : టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త సాధించాడు. విశాఖలో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో 9 వికెట్లు ప‌డ‌గొట్ట‌డం ద్వారా అత‌డు టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ స్థానానికి చేరుకున్నాడు. బుధ‌వారం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌ను ప్ర‌క‌టించింది. గ‌త కొంత‌కాలంగా అగ్ర‌స్థానంలో ఉన్న భార‌త స్పిన్న‌ర్ అశ్విన్ ను వెన‌క్కి నెట్టిన బుమ్రా తొలి స్థానాన్ని అందుకున్నాడు. టెస్టుల్లో బుమ్రా మొద‌టి ర్యాంకును సొంతం చేసుకోవ‌డం ఇదే తొలిసారి

అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లో మొద‌టి ర్యాంకును పొందిన తొలి భార‌త పేస‌ర్‌గా బుమ్రా రికార్డుల‌కు ఎక్కాడు. అదే స‌మ‌యంలో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌ల‌లో మొద‌టి ర్యాంకును సొంతం చేసుకున్న ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. గ‌త కొన్నాళ్లుగా టెస్టుల్లో అగ్ర‌స్థానంలో కొన‌సాగిన భార‌త బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ మూడో ర్యాంకుకు ప‌డిపోయాడు. ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ క‌గిసో ర‌బాడ రెండో స్థానానికి చేరుకున్నాడు.

U19 World Cup 2024 : మ‌రోసారి సెమీఫైన‌ల్‌లోనే ఓడిన ద‌క్షిణాఫ్రికా.. కన్నీళ్లు పెట్టుకున్న ఆట‌గాళ్లు

ఐసీసీ టెస్టు బౌల‌ర్ల ర్యాంకింగ్స్ ఇవే..
1. జ‌స్‌ప్రీత్ బుమ్రా (భార‌త్‌) – 881 రేటింగ్ పాయింట్లు
2. క‌గిసో ర‌బాడ (ద‌క్షిణాఫ్రికా) – 851
3. ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 841
4. పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా) – 828
5. జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 818

Aiden Markram : ఈ క్యాచ్‌ను కావ్యా పాపా చూస్తే మాత్రం.. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ స్ట‌న్నింగ్‌ క్యాచ్‌..