Sunil Gavaskar : సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు.. ఆసీస్‌ను భారత్ 4-0తో ఓడించలేదు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిస్తే చాలు..
టీమ్ఇండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

India to forget about WTC Final focus on winning BGT says Gavaskar
Sunil Gavaskar : సొంత గడ్డపై భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. పైగా మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయి వైట్‌వాష్‌కు గురి అయింది. దీంతో ప్రస్తుతం టీమ్ఇండియా పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ లపై మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు.
కివీస్ చేతిలో ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరుకునే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా ఆసీస్‌తో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు 4-0 తేడాతో గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. లేదంటే ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
IND vs SA : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. డర్బన్‌లో అడుగుపెట్టిన టీమ్ఇండియా..
నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత జట్లు ఐదు టెస్టు మ్యాచులు ఆడనున్నాయి. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం దేవుడెరుగు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచినా తనకు సంతోషమేనన్నాడు.
ప్రస్తుత పరిస్థితులు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారని, ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమ్ఇండియా సొంతం చేసుకున్నా చాలని అన్నారు. ఆసీస్ గడ్డపై ఆసీస్‌ను ఓడించి భారత్ 4-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుందని తాను భావించడం లేదన్నారు. అదే జరిగితే తాను గాల్లో తేలుతాను అని చెప్పారు. 1-0, 2-0, 3-1, 2-1 ఇలా ఎలా గెలిచిన ఫర్వాలేదు. కానీ సిరీస్ గెలవడం ముఖ్యమన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆలోచనలు పక్కన పెట్టి సిరీస్ గెలవడంపై ఫోకస్ పెట్టాలని భారత జట్టుకు సూచించాడు.
IND vs NZ : రిషబ్ పంత్‌ను ఆకాశానికి ఎత్తేసిన కివీస్ మీడియా.. రోహిత్ శర్మ కెప్టెన్సీని మాత్రం..