IND vs SA : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. డర్బన్‌లో అడుగుపెట్టిన టీమ్ఇండియా..
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది.

Team India lands in Durban for T20 series against South Africa
IND vs SA : స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది టీమ్ఇండియా. ఇక ఇప్పుడు మరో సవాల్‌కు సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆతిథ్య దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 8న డర్బన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సీనియర్ ఆటగాళ్లతో పాటు గంభీర్ ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ మార్గనిర్దేశంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో కుర్రాళ్లతో కూడిన టీమ్ సోమవారం దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టింది. డర్బన్‌కు చేరుకున్న భారత జట్టుకు ఫ్యాన్స్, దక్షిణాప్రికా క్రికెట్ అధికారులు ఘన స్వాగతం పలికారు.
IND vs NZ : రిషబ్ పంత్‌ను ఆకాశానికి ఎత్తేసిన కివీస్ మీడియా.. రోహిత్ శర్మ కెప్టెన్సీని మాత్రం..
ఈ విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్
దక్షిణాఫ్రికా జట్టు ఇదే..
ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెర్రీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, ర్యాన్ సిమిప్లాన్, ర్యాన్ సిమిప్లామ్‌టన్, ట్రిస్టన్ స్టబ్స్
టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
మొదటి టీ20 – నవంబర్ 8 – డర్బన్ వేదిక
రెండో టీ20 – నవంబర్ 10 – గ్వెబెర్హా
మూడో టీ20 – నవంబర్ 13 – సెంచూరియన్
నాలుగో టీ20 – నవంబర్ 15- జొహనెస్‌బర్గ్
Touchdown Durban 🛬🇿🇦
How good is #TeamIndia‘s knowledge of their next destination 🤔#SAvIND pic.twitter.com/m4YjikAw6Y
— BCCI (@BCCI) November 4, 2024