India Vs South Africa : భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా.. చెలరేగుతున్న బవుమా

భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ..అడపదడపా ఫోర్లు,..సింగిల్స్ తీస్తూ..స్కోరు బోర్డును పరుగెత్తించారు. బవుమా 83 పరుగులు తీసి సెంచరీ వైపు దూసుకెళుతున్నాడు.

India Vs South Africa : భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా.. చెలరేగుతున్న బవుమా

Team India

Updated On : January 19, 2022 / 5:04 PM IST

Temba Bavuma Half Century : టీమిండియా – దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ కొనసాగుతోంది. 2022, జనవరి 19వ తేదీ బుధవారం జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా చెలరేగిపోయి ఆడుతున్నాడు. భారత బౌలర్లను చీల్చిచెండాడుతున్నాడు. బంతులను బౌండరీలకు తరలిస్తూ..హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తాను కూడా తక్కువ తినలేదని వాండర్ డస్సెన్ బ్యాట్ ఝులిపిస్తున్నాడు. ఇతను కూడా హాఫ్ సెంచరీ నమోదు చేసి సెంచరీ వైపుకు దూసుకెళుతున్నాడు. వీరిద్దరినీ విడదీయడానికి భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.

Read More : CS Sameer Sharma : ఏ ఒక్క ఉద్యోగి గ్రాస్ శాలరీ తగ్గించ లేదు

ఆదిలోనే షాక్ తగిలింది. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసిన మలన్ ను బుమ్రా పెవిలియన్ పంపించాడు. జట్టు స్కోరు 58 వద్ద ఉన్నప్పుడు డికాక్ (27)ను అశ్విన్ అవుట్ చేశాడు. తక్కువ స్కోరుకే రెండు వికెట్లు పడడంతో భారత శిబిరంలో ఆనందం వ్యక్తమైంది. కానీ..ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బవుమా, డస్సేన్ లు చెలరేగిపోయి ఆడుతున్నారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ..అడపదడపా ఫోర్లు,..సింగిల్స్ తీస్తూ..స్కోరు బోర్డును పరుగెత్తించారు. బవుమా 83 పరుగులు తీసి సెంచరీ వైపు దూసుకెళుతున్నాడు. డస్సేన్ 65 రన్లతో క్రీజులో ఉన్నాడు. మార్ క్రమ్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు 38.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

టీమిండియా జట్టు : కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూర్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డి కాక్, జానెమన్ మలన్, తెంబా బవుమా, మార్ క్రమ్, రస్సీ వాండర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, పెహ్లుక్వాయో, మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, తబ్రెయిజ్ షంసి.