CS Sameer Sharma : ఏ ఒక్క ఉద్యోగి గ్రాస్ శాలరీ తగ్గించ లేదు

పీఆర్సీ ఆలస్యం అవుతుందని రూ.17వేల కోట్లు మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే తరహాలోనే హెచ్ఆర్ఏ ఇస్తున్నాయని సీఎస్ వెల్లడించారు.

CS Sameer Sharma : ఏ ఒక్క ఉద్యోగి గ్రాస్ శాలరీ తగ్గించ లేదు

Cs Sameer Sharma Ok

CS Sameer Sharma : పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఏపీ సీఎస్ సమీర్ శర్మ స్పందించారు. ఏ ఒక్క ఉద్యోగి గ్రాస్ శాలరీ ప్రభుత్వం తగ్గించ లేదని ఆయన అన్నారు. పదేళ్ల నుండి నాకు పీఆర్సీ గురించి అవగాహన ఉందన్నారు. అప్పటి పరిస్థితి వేరు…ఇప్పటి పరిస్థితి వేరని చెప్పారు. కరోనా, ఒమిక్రాన్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలు, ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను సమన్వయం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కూడా అన్ని అంశాలపై చర్చించారని చెప్పారు. పీఆర్సీ ఆలస్యం అవుతుందని రూ.17వేల కోట్లు మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే తరహాలోనే హెచ్ఆర్ఏ ఇస్తున్నాయని సీఎస్ వెల్లడించారు.

Alcohol : మద్యం సేవిస్తే హాయిగా నిద్రపడుతుందా? ఇందులో నిజమెంత?

”నేను 2008-09 లో పీఆర్సీ ప్రక్రియలో పాల్గొన్నాను. అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో తేడా వచ్చింది. కరోనా.. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు తెచ్చి పెట్టింది. రాష్ట్ర రెవెన్యూ గణనీయంగా పడిపోయింది. వాస్తవానికి రూ.98వేల కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంది. మారిన పరిస్థితులు వనరులు సరిగ్గా వినియోగించుకోవాలని ప్రకటన వచ్చింది.

ఉద్యోగులకు 17వేల కోట్లు మధ్యంతర భృతి ఇచ్చాం. ఇది వేతనములో భాగం కాదని వారికి తెలుసు. పీఆర్సీ ఆలస్యమైన కారణంగా మధ్యంతర భృతి ఇచ్చాం. 2019 నుంచి గణించి డీఏల చెల్లింపు తదితర అంశాలను ప్రకటించాం. కొన్ని పెరుగుతాయి కొన్ని తగ్గుతాయి. మొత్తంగా వేతనం ఎలా ఉందని చూడాలి. అంతే కాని పూర్తిగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదు.

Amazon Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ లో రూ.15 వేలలోపు స్మార్ట్ ఫోన్స్

పెన్షన్, గ్రాట్యుటీలో కూడా పెరుగుదల ఉంది. కేంద్రం చేసినట్టే ఏపీ కూడా అనుసరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ వర్తింప చేస్తున్నాం. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.54,370 కోట్లుగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రమూ ఉద్యోగ విరమణ వయస్సును పెంచలేదు. నియామకాలు ఉండవన్న ఆరోపణలు సరికావు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అలాగే వైద్యారోగ్య శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చాం” అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు.