ENG vs IND : ఇంగ్లాండ్‌లో 50 ఓవర్లలో 442 పరుగులు చేసిన భారత అండర్-19 జట్టు.. సెంచరీ చేసిన ట్రక్ డ్రైవర్ కొడుకు..
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ యంగ్ లయన్స్‌పై 231 పరుగుల భారీ తేడాతో ఓడించింది.

India U19 Team Smashes 442 Runs In 50 Overs In England
హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగిన జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే.. సీనియర్ జట్టు ఓడిపోయినప్పటికి అండర్-19 జట్టు మాత్రం సత్తా చాటింది.
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ యంగ్ లయన్స్‌పై 231 పరుగుల భారీ తేడాతో ఓడించింది. లాఫ్‌బరోలో జరిగిన మ్యాచ్‌లో భారత కుర్రాళ్ల జట్టు 50 ఓవర్లలోనే 444 పరుగలు చేసింది.
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున మెరుపులు మెరిపించిన ఆయుష్ మాత్రే సారథ్యంలో భారత్ బరిలోకి దిగింది. అయితే.. కెప్టెన్ అయిన ఆయుష్ మాత్రే బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. మరో ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ సైతం 17 పరుగులకే ఔట్ అయ్యాడు.
అయితే.. 18 ఏళ్ల హర్వంశ్ పంగాలియా మాత్రం దుమ్ములేపాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లు బాది 103 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించారు. రాహుల్ కుమార్ (60 బంతుల్లో 73 పరుగులు ), కనిష్క్ చౌహాన్ (67 బంతుల్లో 79 పరుగులు) హాఫ్ సెంచరీలు చేశారు.
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ లయన్స్ 41.1 ఓవర్లలో 211 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ మూడు వికెట్లు పడగొట్టగా.. నమన్ పుష్పక్, విహాన్ మల్హోత్రా చెరో రెండు వికెట్లు తీశారు.
ICC Test Rankings : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..
ట్రక్ డైవర్ కొడుకు..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటిన హర్వంశ్ పంగాలియా స్వస్థలం గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లోని గాంధీధామ్. ఈ కుర్రాడి కుటుంబం ప్రస్తుతం కెనడాలో స్థిరపడింది. అతడి తండ్రి బ్రాంప్టన్‌లో ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.