ICC Test Rankings : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌.. చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌..

టీమ్ఇండియా వైస్ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు.

ICC Test Rankings : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌.. చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌..

ICC Test Rankings Rishabh Pant Reaches All Time High

Updated On : June 25, 2025 / 3:38 PM IST

టీమ్ఇండియా వైస్ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 800 రేటింగ్ పాయింట్ల‌ను సాధించాడు. ఈ క్ర‌మంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో 800 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భార‌త వికెట్ కీప‌ర్‌గా రిష‌బ్ పంత్ రికార్డుల‌కు ఎక్కాడు.

ఇంగ్లాండ్‌తో లీడ్స్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పంత్ రెండు శ‌త‌కాలు చేయ‌డంతో ఓ స్థానాన్ని మెరుగుప‌ర‌చుకున్నాడు. 801 రేటింగ్ పాయింట్ల‌తో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వికెట్ కీప‌ర్ల‌లో పంత్‌దే అత్యుత్త‌మ ర్యాంక్ కావ‌డం విశేషం. ఇక టాప్‌-10లో పంత్ పాటు య‌శ‌స్వి జైస్వాల్ ఉన్నాడు. అత‌డు నాలుగో స్థానంలో నిలిచాడు.

Rishabh Pant : టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ..

టీమ్ఇండియా కొత్త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఏకంగా ఐదు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని 20వ స్థానానికి చేరుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేసిన కేఎల్ రాహుల్ ఏకంగా 10 స్థానాలు ఎగ‌బాకి 38కి చేరుకున్నాడు.

ఇక ఇంగ్లాండ్ ఆట‌గాళ్ల విష‌యానికి వ‌స్తే.. భార‌త్ పై శ‌త‌కంతో చెల‌రేగిన బెన్ డ‌కెట్ ఐదు స్థానాలు ఎగ‌బాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జోరూట్ ఉండ‌గా రెండో స్థానంలో హ్యారీ బ్రూక్ కొన‌సాగుతున్నాడు.

ఐసీసీ టెస్ట్ టాప్‌-5 బ్యాట‌ర్ల‌ ర్యాంకింగ్స్ ఇవే..

జో రూట్ (ఇంగ్లాండ్‌) – 889 రేటింగ్ పాయింట్లు
హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) – 874 రేటింగ్ పాయింట్లు
కేన్ విలియ‌మ్స‌న్ (న్యూజిలాండ్‌) – 867 రేటింగ్ పాయింట్లు
య‌శ‌స్వి జైస్వాల్ (భార‌త్‌) – 851 రేటింగ్ పాయింట్లు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 824 రేటింగ్ పాయింట్లు

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. 
బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో పెద్ద‌గా మార్పులు లేవు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో ఐదు వికెట్లు తీసిన బుమ్రా అగ్ర‌స్థానంలోనే కొన‌సాగుతుండ‌గా ర‌బాడ‌, క‌మిన్స్‌, నౌమ‌న్ అలీ లు ఆ త‌రువాతి స్థానాల్లోనే కొన‌సాగుతున్నారు.

Ishan Kishan : పాక్ ఆట‌గాడితో ఇషాన్ కిష‌న్ సంబురాలు.. వీడియో వైర‌ల్‌..

ఐసీసీ టెస్ట్ టాప్‌-5 బౌల‌ర్ల ర్యాంకింగ్స్ ఇవే..
జ‌స్‌ప్రీత్ బుమ్రా (భార‌త్‌) – 907 రేటింగ్ పాయింట్లు
క‌గిసో ర‌బాడ (ద‌క్షిణాఫ్రికా) – 868 రేటింగ్ పాయింట్లు
పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా) – 847 రేటింగ్ పాయింట్లు
నోమ‌న్ అలీ (పాకిస్థాన్‌) – 806 రేటింగ్ పాయింట్లు
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 805 రేటింగ్ పాయింట్లు