IND vs AUS 2nd Test Match: తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 ఆలౌట్.. తొలిరోజు టీమిండియా స్కోరు 21.. Live Updates

బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఆడింది. తొలి ఇన్నింగ్సులో 263 పరుగులు మాత్రమే చేయగలిగింది.

IND vs AUS 2nd Test Match: తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 ఆలౌట్.. తొలిరోజు టీమిండియా స్కోరు 21.. Live Updates

IND vs AUS 2nd Test Match

Updated On : February 17, 2023 / 6:32 PM IST

IND vs AUS 2nd Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఆడింది. తొలి ఇన్నింగ్సులో 263 పరుగులు మాత్రమే చేయగలిగింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 17 Feb 2023 05:06 PM (IST)

    తొలిరోజు టీమిండియా స్కోరు 21

    తొలి ఇన్నింగ్స్ లో తొలిరోజు ఆట ముగిసింది. టీమిండియా 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 13, కేఎల్ రాహుల్ 4 పరుగులతో ఉన్నారు.

  • 17 Feb 2023 04:31 PM (IST)

    భారత ఓపెనర్లుగా క్రీజులోకి రోహిత్, కేఎల్ రాహుల్

    తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా క్రీజులోకి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వచ్చారు. టీమిండియా స్కోరు 2 ఓవర్ల నాటికి 10గా ఉంది. రోహిత్ 6 పరుగులతో క్రీజులో ఉండగా కేఎల్ రాహుల్ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.

  • 17 Feb 2023 04:15 PM (IST)

    ఆస్ట్రేలియా ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్ స్కోరు 263

    ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు స్కోరు 263. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖ్వాజా 81, పీటర్ హ్యాండ్‌కాంబ్ 72 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లలో షమీ 4 వికెట్లు తీశాడు. అతడు మొత్తం 14.4 ఓవర్లు వేసి 60 పరుగులు ఇచ్చాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. అశ్విన్ మొత్తం 21 ఓవర్లు వేసి, 68 పరుగులు ఇచ్చాడు. రవీంద్ర జడేజా 21 ఓవర్లు వేసి 68 పరుగులు ఇచ్చాడు.

  • 17 Feb 2023 03:59 PM (IST)

    9వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. నాథన్ లియాన్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పీటర్ హ్యాండ్‌కాంబ్ 63, మాథ్యూ కుహ్నెమాన్ 0 ఉన్నారు.

  • 17 Feb 2023 03:38 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    మొదటి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్యాట్ కమ్మిన్స్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ముర్ఫీ డకౌట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం పీటర్ హ్యాండ్‌కాంబ్ 61, నాథన్ లియాన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

  • 17 Feb 2023 03:07 PM (IST)

    ఆస్ట్రేలియా స్కోరు 63 ఓవర్లనాటికి 214/6

    మొదటి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా స్కోరు 63 ఓవర్లనాటికి 214/6గా ఉంది. క్రీజులో పీటర్ హ్యాండ్‌కాంబ్ 45, ప్యాట్ కమ్మిన్స్ 29 పరుగులతో ఉన్నారు.

  • 17 Feb 2023 02:46 PM (IST)

    కే.ఎల్. రాహుల్ సూపర్ క్యాచ్ ..

    రెండో టెస్టు మొదటి రోజు ఆటలో కే.ఎల్. రాహుల్ సూపర్ క్యాచ్ పట్టాడు. జడేజా వేసిన బంతికి ఆసీస్ బ్యాటర్ ఖవాజ (81) రివర్స్ స్వీప్ షాట్‌తో బంతిని గాల్లోకి లేపాడు. షార్ట్ మిడాన్‌లో ఫీల్డింగ్‌లో ఉన్న కే.ఎల్. రాహుల్ వేగంగా జంప్ చేసి బాల్‌ను అందుకున్నాడు. సెంచరీకి చేరువులో ఉన్న ఖవాజ అనూహ్య రీతిలో పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.

  • 17 Feb 2023 02:30 PM (IST)

    టీ బ్రేక్ సమయానికి ఆసీస్ స్కోర్ 199/6

    టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 56 ఓవర్లు ఆడింది. ఆరు వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (36), ఆసీస్ కెప్టెన్ ప్యాట్స్ కమిన్స్ (23) ఆచితూచి ఆడుతూ క్రీజ్‌లో పాతుకుపోతున్నారు.

  • 17 Feb 2023 01:49 PM (IST)

    ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్..

    ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయింది. 45.5వ ఓవర్లో ప్రమాదకరంగా మారుతున్న హ్యాండ్స్ క్యాంబ్, ఉస్మాన్ ఖవాజా(81) జోడీని రవీంద్ర జడేజా విడదీశాడు. జడేజా వేసిన లెగ్ సైడ్ బంతిని రివర్స్ స్వీప్ కొట్టే క్రమంలో ఆఫ్ సైడ్ లో రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. దీంతో 81 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద ఖవాజా ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన అలెక్స్ క్యారీ అశ్విన్ వేసిన బంతికి డకౌట్ గా పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం 49 ఓవర్లకు ఆసీస్ 171 పరుగులు చేసింది.  క్రీజ్‌లో పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (31), ప్యాట్‌ కమిన్స్ (0) ఉన్నారు.

  • 17 Feb 2023 01:25 PM (IST)

    ఆసీస్ స్కోర్ 161/4 ..

    ఆస్ట్రేలియా స్కోర్ బోర్డు వేగంగా పెరుగుతోంది. ఆసీస్ ఓపెనర్ ఖవాజా (77), హ్యాండ్స్‌కాంబ్ (25) దూకుడుగా ఆడుతూ ఆసీస్ స్కోర్ బోర్డును పెంచేస్తున్నారు. దీంతో 44 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.

  • 17 Feb 2023 12:57 PM (IST)

    35 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 121/4

    35 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ స్కోర్ 121/4కు చేరింది. ఓపెనర్ గా క్రీజ్‌లోకి వచ్చిన ఖవాజా (55), పీటర్ హ్యాండ్స్‌కాంబ్(11) నిలకడగా ఆడుతున్నారు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా బౌలింగ్ వేస్తున్నారు.

  • 17 Feb 2023 12:22 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ ..

    ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్ తరువాత నిలకడగా ఆడుతూ వచ్చిన ట్రావిస్ హెడ్, ఖవాజా భాగస్వామ్యానికి మహ్మద్ షమీ చెక్ పెట్టాడు. 32వ ఓవర్లో షమీ వేసిన రెండో బంతికి ట్రావిస్ హెడ్ (12) స్లిప్‌లో కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో 108 పరుగుల వద్ద ఆసీస్ నాల్గో వికెట్ కోల్పోయింది.

  • 17 Feb 2023 11:36 AM (IST)

    ఆఫ్ సెంచరీ చేసిన ఖవాజా ..

    వరుస వికెట్లు కోల్పోతున్నా ఆసీస్ ఓపెన్ ఉస్మాన్ ఖవాజా ఆచితూచి ఆడుతూ ఆసీస్ స్కోర్ బోర్డును పెంచుతున్నాడు. ఈ క్రమంలో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 25 ఓవర్లకు (లంచ్ బ్రేక్) ఆసీస్ స్కోర్ 94/3.

  • 17 Feb 2023 11:34 AM (IST)

    మూడు వికెట్లు డౌన్ ..

    ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ వేసిన 23వ ఓవర్లో నాలుగో బంతికి లబుషేన్ (18) ఎల్బీ రూపంలో ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన స్మిత్ అదే ఓవర్లో చివరి బంతికి కీపర్ భరత్ కి క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో పెవిలియన్ బాట్ పట్టాడు.

  • 17 Feb 2023 11:13 AM (IST)

    20 ఓవర్లకు 87/1 ..

    20 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 87/1 చేరింది. క్రీజ్‌లో ఖవాజా (45), లబుషేన్ (16) ఉన్నారు. ఖవాజా దూకుడుగా ఆడుతూ.. ఆఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.

  • 17 Feb 2023 11:00 AM (IST)

    18ఓవర్లకు ఆసీస్ స్కోర్ 68/1 ..

    18ఓవర్లకు ఆసీస్ స్కోర్ 68/1. క్రీజ్‌లో ఖవాజా (35), లబుషేన్ (8) ఉన్నారు. అశ్విన్, షమీ బౌలింగ్ వేస్తున్నారు.

  • 17 Feb 2023 10:58 AM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ..

    ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. షమీ వేసిన 16వ ఓవర్లో రెండో బంతికి డేవిడ్ వార్నర్ (15) కీపర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లబుషేన్ క్రీజ్‌లోకి వచ్చాడు.

  • 17 Feb 2023 10:51 AM (IST)

    ఆస్ట్రేలియా స్కోర్ 50/0

    ఆస్ట్రేలియా స్కోర్ 15 ఓవర్లకు 50కు చేరింది. ఉస్మాన్ ఖవాజా (29), డేవిడ్ వార్నర్ (15) క్రీజ్‌లో ఉన్నారు.

  • 17 Feb 2023 10:36 AM (IST)

    12 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ స్కోర్ 37/0. ఉస్మాన్ ఖవాజా (24), డేవిడ్ వార్నర్ (7) క్రీజ్‌లో ఉన్నారు.

  • 17 Feb 2023 10:23 AM (IST)

    10 ఓవర్లుకు ఆసీస్ స్కోర్ 26/0 ..

    ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఖవాజాలు ఆచితూచి ఆడుతున్నారు. దీంతో 10 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. తొలుత దూకుడుగా ఆడిన ఖవాజా.. ప్రస్తుతం నెమ్మదిగా ఆడుతున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్కోర్ 26/0 కాగా.. ఉస్మాన్ ఖవాజా (14), డేవిడ్ వార్నర్ (6) క్రీజ్ లో ఉన్నారు.

  • 17 Feb 2023 10:06 AM (IST)

    ఆచితూచి ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు..

    ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్, ఖవాజాలు ఆచితూచి ఆడుతున్నారు. ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏడు ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోర్ 21 పరుగులు. ఖజావా (13), వార్నర్ (2) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. సిరాజుద్దీన్, అశ్విన్ బౌలింగ్ వేస్తున్నారు.

  • 17 Feb 2023 09:47 AM (IST)

    మూడు ఓవర్లు.. 18 రన్స్..

    ఓపెనర్లుగా క్రీజ్ లోకి వచ్చిన డేవిడ్ వార్నర్, ఖవాజాలు నిలకడగా ఆడుతున్నారు. ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వార్నర్ 9 బాల్స్ ఎదుర్కొని ఒక్క పరుగుకూడా చేయలేదు. ఉస్మాన్ ఖవాజా 11 బాల్స్ ఎదుర్కొని 12 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి. ఖవాజా దూకుడుగా ఆడుతున్నాడు. షమీ, సిరాజుద్దీన్ లు బౌలింగ్ వేస్తున్నారు.

  • 17 Feb 2023 09:37 AM (IST)

    ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభం ..

    టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజాలు క్రీజ్ల‌లోకి వచ్చారు. తొలి ఓవర్ మహ్మద్  షమీ వేయగా.. తొలి ఓవర్లో తొలిబాల్‌కే బైస్ రూపంలో నాలుగు రన్స్ వచ్చాయి.

  • 17 Feb 2023 09:34 AM (IST)

    వందో టెస్ట్ ఆడుతున్న పుజారా ..

    టీమిండియా బ్యాట్స్‌మెన్ పుజారా వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్నారు. టెస్టుల్లో సెంచరీ క్లబ్ లో చేరిన పుజారాకు మాజీ క్రికెటర్ గవాస్కర్ తన చేతులమీదుగా క్యాప్ అందజేసి, స్వాగతం పలికారు.

  • 17 Feb 2023 09:30 AM (IST)

    టాస్ గెలిచిఉంటే మేమూ బ్యాటింగ్‌కే వెళ్లేవాళ్లం .. రోహిత్

    టాస్ అనంతరం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టాస్ గెలిచిఉంటే మేముకూడా ముందు బ్యాటింగ్ తీసుకొనేవాళ్లం. అనంతరం టీమిండియా బ్యాట్స్‌మెన్ పుజారా 100వ టెస్టు గురించి రోహిత్ మాట్లాడుతూ.. పుజారా వందో టెస్టుకోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. అతని కుటుంబంకూడా ఇక్కడే ఉంది. 100 టెస్టు మ్యాచ్‌లు అంత ఈజీకాదు. అతని కెరీర్‌లో ఎన్నో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

  • 17 Feb 2023 09:24 AM (IST)

    భారత్ తుది జట్టు ..

    రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ ( వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

    ఆస్ట్రేలియా తుది జట్టు..

    డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్( కెప్టెన్), టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్, మాథ్యూ కుహ్నెమాన్.

  • 17 Feb 2023 09:22 AM (IST)

    సూర్యకుమార్ ఔట్.. శ్రేయాస్ ఇన్..

    రెండో టెస్టు తుది జట్టులో టీమిండియా స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతుంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను తుదిజట్టులోకి తీసుకున్నారు.

  • 17 Feb 2023 08:58 AM (IST)

    శ్రేయాస్‌ అయ్యర్‌కు తుది జట్టులో చోటుదక్కుతుందా?

    రెండో టెస్టు తుదిజట్టులో టీమిండియాలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను బరిలోకి దింపేందుకు టీం మేనేజ్‌మెంట్ దృష్టిసారించింది. మొదటి టెస్టుకు దూరంగా ఉన్న శ్రేయాస్.. గాయం నుండి కోలుకొని జట్టులోకి వచ్చాడు. అయితే, ఐదు రోజులు ఆడేందుకు ఫిట్‌నెస్‌ను శ్రేయాస్ నిరూపించుకుంటే తుది జట్టులో అవకాశం ఉంటుందని కోచ్ ద్రవిడ్ తెలిపాడు.

  • 17 Feb 2023 08:51 AM (IST)

    ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పదేళ్ల తర్వాత ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు మ్యాచ్ మరికొద్దిసేపట్లో జరగనుంది. 2013 మార్చిలో చివరిసారిగా ఈ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • 17 Feb 2023 08:48 AM (IST)

    ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టుకు చేదు అనుభవమే ఉంది. ఇక్కడ కంగారూ జట్టు ఇప్పటివరకు భారత జట్టుతో ఏడు టెస్టులు ఆడగా, అందులో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. 1969లో ఇక్కడ జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది.

  • 17 Feb 2023 08:45 AM (IST)

    ఒక వికెట్ దూరంలో జడేజా ..

    టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో 250 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. ఈరోజు ప్రారంభమయ్యే ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టులో భాగంగా ఈ మైలురాయిని చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు.

  • 17 Feb 2023 08:40 AM (IST)

    స్పిన్‌కే అనుకూలం ..

    ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం అవుతుంది. ఈ గ్రౌండ్‌లో పిచ్ స్పిన్నర్లకే అనుకూలం. అయితే, ఎంత త్వరగా స్పిన్నర్లకు సహకరిస్తుందనేది కీలకంగా మారింది. క్రీజులో కుదురుకుంటే బ్యాటర్లు పరుగులు చేయొచ్చు.