విశాఖపట్టణం : భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టీ -20 మ్యాచ్ కోసం విశాఖ వాసులు వేచి చూస్తున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇందుకు ఫిబ్రవరి 02వ తేదీ నుండి టికెట్ల అమ్మకాలు ప్రారంభించనున్నారు. విశాఖపట్టణం లోని ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగబోతోంది. ఫిబ్రవరి 02వ తేదీ శనివారం నుండి ఆన్ లైన్‌లో టికెట్లు విక్రయాలు షురూ చేయనున్నారు. రూ. 500, రూ. 1200, రూ. 1600, రూ. 2 వేలు, రూ. 4వేలు, రూ. 5వేల టికెట్లున్నాయి.
ఉదయం 08గంటల నుండి www.eventsnow.com వెబ్ సైట్ నుండి టికెట్లు పొందవచ్చని ఏసీఏ మీడియా మేనేజర్ వెల్లడించారు.
ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 24న జరగనుంది. రెండో టీ20 మ్యాచ్‌కు విశాఖ వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 27న రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ 20 మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సహం నెలకొంది. అదిరిపోయె సిక్స్‌లు, పోర్లు ఈ మ్యాచ్ లో చూడవచ్చు.