India vs Australia 2nd Test: జోరుమీద టీమ్ఇండియా.. నేటి నుంచి ఇండియా, ఆసీస్ రెండో టెస్ట్ మ్యాచ్ ..
టీమ్ఇండియా తుదిజట్టులో స్వల్పమార్పులు జరిగే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను బరిలోకి దించే అవకాశాలున్నాయి. అయితే శ్రేయాస్ ఫిట్‌నెస్‌ను బట్టి తుదిజట్టులోకి తీసుకుంటారా? లేదా అనేది తెలుస్తోంది.

India vs Australia 2nd Test
India vs Australia 2nd Test: బోర్డర్ – గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా నేడు ఇండియా వర్సెస్ ఆసీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉదయం 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి మ్యాచ్ పూర్తయింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా 132 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్లు అద్భుత బౌలింగ్‌తో మూడు రోజుల్లోనే ఆసీస్ చేతులెత్తేసింది. దీంతో 1-0 ఆధిక్యంలో టీమ్ఇండియా కొనసాగుతుంది. రెండో టెస్ట్ మ్యాచ్‌లో విజయంతో ఇండియా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని ఆసీస్ పట్టుదలతో ఉంది. అయితే, ఈ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలించనుండటంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ భారత్ స్పిన్నర్లను ఏ విధంగా ఎదుర్కొంటారనే ఆసక్తి నెలకొంది.
వార్నర్ పేలవ ఫామ్ ఆసీస్‌కు ఆందోళనకరంగా మారింది. గత టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో షమీ బౌలింగ్‌లో అతను బౌల్డ్ అయిన విధానం తన తడబాటుకు నిదర్శనంగా క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్పిన్‌ను బాగా ఆడే లబుషేన్, స్మిత్ పైనే రెండో మ్యాచ్‌లో ఆసీస్ భారీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. తొలి టెస్టులో కేవలం ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఆసీస్.. రెండో టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే, మూడో స్పిన్నర్‌గా అస్టాన్ అగర్‌ను ఎంచుకుంటారా లేక ఇంకా అరంగ్రేటం చేయని మ్యాట్ కునెమన్‌ను ఆడిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీమ్ఇండియా తొలి టెస్టు విజయంతో జోష్‌మీద ఉంది. రెండో టెస్టులోనూ స్పిన్‌తో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చేందుకు సిద్ధమైంది.
IND vs AUS Test Match: ఇండియా, ఆసీస్ మూడో టెస్ట్ మ్యాచ్ వేదిక మారింది.. ట్వీట్ చేసిన బీసీసీఐ
టీమ్ఇండియా తుదిజట్టులో స్వల్పమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను బరిలోకి దించే అవకాశాలున్నాయి. అయితే శ్రేయాస్ ఫిట్ నెస్‌ను బట్టి తుదిజట్టులోకి తీసుకుంటారా? లేదా అనేది తెలుస్తోంది. రెండో టెస్టు జరిగే ఢిల్లీ మైదానంలో ఆస్ట్రేలియా జట్టుకు చెత్తరికార్డు ఉంది. ఇక్కడ ఆసీస్ జట్టు ఇప్పటి వరకు భారత్ జట్టుతో ఏడు టెస్టులు ఆడగా.. అందులో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఢిల్లీలోని ఈ మైదానంలో పదేళ్ల తర్వాత ఇండియా – ఆసీస్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది. అంతకుముందు మ్యాచ్ 2013 మార్చిలో జరిగింది. ఆ టెస్టు మ్యాచ్‌ను కేవలం మూడు రోజుల్లోనే ముగించిన టీమ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.