India vs Australia : వారిద్దరికీ చావోరేవో సిరీస్

India vs Australia : వారిద్దరికీ చావోరేవో సిరీస్

Updated On : December 24, 2020 / 2:27 PM IST

India vs Australia: టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు పుజారా (Pujara), అజింక్య రహానె (Rahane)కు తామేంటో నిరూపించుకొనేందుకు ఇదే చివరి సిరీస్‌ కావొచ్చని మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తా (Deep Dasgupta) అన్నారు. వీరిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లే అయినా కొంతకాలంగా నిలకడగా రాణించడం లేదన్నారాయన. బోర్డర్‌-గవాస్కర్‌ (Border Gavaskar series) ట్రోఫీలో వారిపై బాధ్యతల బరువు ఎక్కువే ఉందని అభిప్రాయపడ్డారు. ఇది వారికి చావోరేవో సిరీస్‌ అని వెల్లడించారు. ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న టెస్టు సిరీసులో టీమ్‌ ఇండియా (Team India) 0- 1 తో వెనకబడింది. అడిలైడ్‌ వేదికగా గులాబి బంతి (Pink Ball)తో జరిగిన టెస్టులో కోహ్లీసేన చిత్తుగా ఓడిపోయింది.

రెండో రోజు పట్టుబిగించిన భారత్‌ మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 36కే కుప్పకూలింది. చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు ఆలౌటైంది. తొలి టెస్టు ముగిశాక విరాట్‌ కోహ్లీ స్వదేశానికి బయల్దేరడంతో రహానె, పుజారా వంటి సీనియర్లపై బాధ్యత పెరిగింది. వారిప్పుడు కచ్చితంగా రాణించాల్సిన అవసరముందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అజింక్య రహానె, పుజారాకు ఇది పెద్ద సిరీసు. ప్రత్యేకించి ఇప్పుడున్న సంక్లిష్ట సమయంలో మరీ ఎక్కువ బాధ్యత ఉంది. ఇప్పటికే రహానె అత్యుత్తమంగా ఆడటం లేదనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. గత 2 నుంచి 3 ఏళ్లలో అతడు కొన్ని మ్యాచుల్లో బాగా రాణించాడు. మరోవైపు రెండోటెస్టు కోసం టీమ్ మేనేజ్‌మెంట్ కసరత్తు చేస్తోంది. జట్టులో స్వల్పమార్పులు చేర్పులకు ప్లాన్ చేస్తోంది.