ENG vs IND 3rd T20 : టీమిండియా ఘోర ఓటమి.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్.. వాళ్ల వల్లే ఈ పరిస్థితి
ENG vs IND 3rd T20 : ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది.
Shreyas Iyer
- ఇంగ్లాండ్తో మూడో టీ20 మ్యాచ్
- 125 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా
- పరుగులు రాబట్టడంలో చేతులెత్తేసిన బ్యాటర్లు
ENG vs IND 3rd T20 : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లోనూ భారత్ జట్టు ఓడిపోయింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా భారీ పరుగుల తేడాతో ఓటమి పాలమైంది. దీంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20 వర్షంతో రద్దయిన విషయం తెలిసిందే.
Also Read : IND vs ENG : మూడో టీ20కి ముందు టీమ్ఇండియాకు భారీ షాక్.. బుడ్డోడికి గాయం..
మూడో టీ20 మ్యాచ్లో భాగంగా తొలుత ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70) భారీ ఇన్నింగ్స్ తో మెరిశాడు. చివర్లో సామ్ కరన్ (24బంతుల్లో 41నాటౌట్), విల్ జాక్స్ (7బంతుల్లో 14) దూకుడుగా ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 201 పరుగులు చేసింది. భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకిదిగిన టీమిండియా బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఏ ఒక్క బ్యాటర్ భారీ స్కోర్ చేయకపోవటంతో టీమిండియా 11.4 ఓవర్లలోనే 76 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 125 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత భ్యాట్స్మెన్స్లో వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ఇద్దరూ చెరో 13 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. మేము చాలా చెత్తగా ఆడాం. ఇంత భారీ పరుగుల తేడాతో ఓడిపోవటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అయినా, ఈ ఓటమిని అంగీకరించాల్సిందే. టెంట్ బ్రిడ్జ్ వంటి పిచ్ పై బౌలర్లు 200 పరుగులు ఇవ్వండం సరికాదు. ఈ పిచ్ పై బౌలర్లకు హార్డ్ లెంథ్ బాగా కలిసొచ్చింది. కానీ, మేము దాన్ని సరిగ్గా అమలు చేయలేకపోయాం. ఆ తరువాత భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మేము ఘోరంగా విఫలమయ్యాం.
ముఖ్యంగా పవర్ ప్లేలో కీలక వికెట్లు కోల్పోవటం వల్లనే మేము దెబ్బతిన్నాం. వైఫల్యాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. ఆటగాళ్లు జట్టుపై తమదైన ముద్ర వేయడం గురించి ఆలోచించడం ముఖ్యం. మేము బలంగా పుంజుకోవాలి. మా ఆటతీరుపై పునరాలోచన చేయాల్సి ఉంది. అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.
Shreyas Iyer said, “it was atrocious, losing by that margin is not acceptable”. pic.twitter.com/6J8jjb57kr
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2026
