IND vs SA 2nd Test: 202 పరుగులకే భారత్ ఆలౌట్.. పరువు కాపాడిన అశ్విన్, బుమ్రా!

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్ మొదటిరోజు సఫారీలు పైచేయి సాధించారు.

IND vs SA 2nd Test: 202 పరుగులకే భారత్ ఆలౌట్.. పరువు కాపాడిన అశ్విన్, బుమ్రా!

ndia vs South Africa 2nd Test

Updated On : January 3, 2022 / 8:15 PM IST

IND vs SA 2nd Test: India vs South Africa 2nd Test Live Score Updatesభారత్ 63.1 ఓవర్లోలో 202 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జెన్సన్ 4 వికెట్లు తీసి భారత్‌ని భారీ స్కోరు చెయ్యకుండా కట్టడి చెయ్యగలిగాడు. వెన్ను నొప్పితో ఈ మ్యాచ్‌కి కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరంగా ఉండగా.. టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ 133 బంతుల్లో హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇన్నింగ్స్‌ చివర్లో అశ్విన్(46), జస్‌ప్రీత్ బుమ్రా (14) స్కోరు 200పరుగులు చెయ్యడంలో సాయం చేశారు. 36 పరుగుల వద్ద తొలి వికెట్‌ పడగా.. వెంటనే క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ 26 పరుగులకు అవుటయ్యాడు. పుజారా 3 పరుగులకే అవుట్ అయ్యాక.. రహానె డకౌట్‌‌గా పెవిలియన్ చేరాడు.

పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్‌ని కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ గట్టెక్కించినా.. రాహుల్ అవుటయ్యాక.. భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆశ్విన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 46 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జెన్సన్ నాలుగు వికెట్లు, ఓలివర్ మూడు వికెట్లు, కాగిసో రబడ మూడు వికెట్లు తీశారు.