Ind Vs SA : తొలి రోజే భారత్ 223 ఆలౌట్‌, విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్

నిర్ణయాత్మక కేప్‌టౌన్‌ టెస్టులో తొలి రోజే భారత జట్టు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు మాత్రమే చేసింది.

Ind Vs SA : తొలి రోజే భారత్ 223 ఆలౌట్‌, విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్

Ind Vs Sa Cape Town

Updated On : January 11, 2022 / 10:02 PM IST

Ind Vs SA : నిర్ణయాత్మక కేప్‌టౌన్‌ టెస్టులో తొలి రోజే భారత జట్టు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్ ఆడాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కోహ్లి కీలక సమయంలో పెవిలియన్‌కు చేరాడు. 79 పరుగులతో కోహ్లీ టాప్ స్కోర్ గా నిలిచాడు.

పుజారా (43), రిషభ్‌ పంత్ (27) ఫర్వాలేదనిపించారు. కేఎల్‌ రాహుల్‌ 12, మయాంక్ అగర్వాల్‌ 15, అజింక్య రహానె 9, అశ్విన్‌ 2, శార్దూల్‌ ఠాకూర్‌ 12, ఉమేశ్‌ 4*, షమీ 7 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడా 4, మార్కో జాన్‌సెన్ 3 వికెట్లు తీశారు. ఒలీవియర్‌, లుంగి ఎంగిడి, కేశవ్ మహరాజ్‌ తలో వికెట్‌ తీశారు.

Actress Married Cricketers: క్రికెటర్లతో లైఫ్ షేర్ చేసుకున్న హీరోయిన్లు

మూడో టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, పేసర్లకు విశేషంగా సహకరిస్తున్న కేప్ టౌన్ పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు టీమిండియా ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు.

TATA IPL: బీసీసీఐకి అదనంగా రూ.130కోట్లు లాభం

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టుకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. ఆరంభంలోనే కెప్టెన్ డీన్ ఎల్గార్ (3) వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. ఎల్గార్ ను బుమ్రా ఔట్ చేశాడు.