India Vs Sri Lanka: అర్ధ సెంచరీ బాదిన శ్రీలంక బ్యాట్స్‌మన్ మెండీస్.. 8 ఓవర్లలో 80 పరుగులు

India Vs Sri Lanka

India Vs Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచు జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. పాథుం నిస్సాంకా 23, కుశాల్ మెండీస్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎనిమిది ఓవర్లకు శ్రీలంక 80 పరుగులు చేసింది. కాగా, రాహుల్ త్రిపాఠి టీ20ల్లోకి ప్రవేశించాడు. మొదటి టీ20లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.

టీమిండియా: ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా, దీపక్ హూడా, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, యజువేంద్ర చాహెల్ ఉన్నారు.

శ్రీలంక జట్టు: నిస్సాంకా, కుశాల్ మెండీస్, డె సిల్వా, అసలంక, బీ రాజపక్స, శనాకా, హసరంగా, కరుణరత్నే, తీక్షణ, కె.రాజిత, మదుశంక.

Bihar: వీధి కుక్కలపై వేట ప్రారంభించిన బిహార్ ప్రభుత్వం.. కారణం ఏంటంటే?