India Vs Sri Lanka: 9 సిక్సులు, 7 ఫోర్లతో చెలరేగి సెంచరీ చేసిన సూర్య.. శ్రీలంక లక్ష్యం 229 పరుగులు

రాజ్‌కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, శ్రీలంక మధ్య జరుగుతోన్న చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడి సెంచరీ బాదాడు. దీంతో శ్రీలంక ముందు భారత్ 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.

India Vs Sri Lanka: 9 సిక్సులు, 7 ఫోర్లతో చెలరేగి సెంచరీ చేసిన సూర్య.. శ్రీలంక లక్ష్యం 229 పరుగులు

India Vs Sri Lanka

Updated On : January 7, 2023 / 8:49 PM IST

India Vs Sri Lanka: రాజ్‌కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, శ్రీలంక మధ్య జరుగుతోన్న చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడి సెంచరీ బాదాడు. దీంతో శ్రీలంక ముందు భారత్ 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.

ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే ఓట్ అయినప్పటికీ, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 46 పరుగులు చేశాడు. వాటిలో మూడు సిక్సులు, రెండు ఫోర్లు ఉన్నాయి. ఇక రాహుల్ త్రిపాఠి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. నాలుగో స్థానంలో దిగిన సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడుతూ 51 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వాటిలో తొమ్మిది సిక్సులు, ఏడు ఫోర్లు ఉన్నాయి. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ చేసిన మూడో సెంచరీ ఇది.

హార్దిక్ పాండ్యా 4, దీపక్ హూడా 4, అక్షర్ పటేల్ 21 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మదుశంకా 2, కాసన్ రాజిత, హసరంగా, కరుణరత్నే ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

కాగా, మొదటి టీ20లో టీమిండియా విజయం సాధించింది. రెండో టీ20లో శ్రీలంక గెలిచింది. దీంతో నేటి మ్యాచులో గెలిచే జట్టు టీ20 సిరీస్ కైవసం చేసుకుంటుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు రోజుల అనంతరం వన్డే మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

Galla Satyanarayana: సంక్రాంతి తరువాత బీజేపీలో భారీ చేరికలు