India Vs Sri Lanka 2nd T20I: నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టీ20 మ్యాచ్.. తుది జట్టులో మార్పులు ఇవే!

తొలిమ్యాచ్‌లో సంజూ శాంసన్ గాయం కారణంగా నేడు జరిగే మ్యాచ్‌కు జట్టులో స్వల్పమార్పులు చోటు చేసుకోనున్నాయి. సంజూ శాంసన్ స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జితేశ్ శర్మను సెలెక్టర్లు జట్టులోకి ఎంపికచేశారు. అయితే తుది జట్టులో శాంసన్ స్థానంలో ..

India Vs Sri Lanka 2nd T20I: నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టీ20 మ్యాచ్.. తుది జట్టులో మార్పులు ఇవే!

Team India

Updated On : January 5, 2023 / 7:20 AM IST

India Vs Sri Lanka 2nd T20I: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం రెండో టీ20మ్యాచ్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7గంటలకు ప్రారంభమవుతుంది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. చివరి ఓవర్‌లో అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో శ్రీలంక విజయాన్ని అడ్డుకున్నారు. నేడు జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే టీ20 సిరీస్ భారత్ ఖాతాలో చేరుతుంది.

India vs Srilanka 1st T20 Match: ఉత్కంఠ పోరులో శ్రీలంక జట్టుపై టీమిండియా విజయం (ఫొటో గ్యాలరీ)

తొలిమ్యాచ్‌లో సంజూ శాంసన్ గాయం కారణంగా నేడు జరిగే మ్యాచ్‌లో స్వల్పమార్పులు చోటు చేసుకోనున్నాయి. సంజూ శాంసన్ స్థానంలో విదర్భ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జితేశ్ శర్మను సెలెక్టర్లు జట్టులోకి ఎంపికచేశారు. అయితే తుది జట్టులో శాంసన్ స్థానంలో రాహుల్ త్రిపాఠి అరంగ్రేటంకు అవకాశం లేకపోలేదు. తొలిమ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించినప్పటికీ.. బ్యాటింగ్ విభాగంలో ఆటగాళ్లు విఫలం అయ్యారనే చెప్పాలి.

India vs SriLanka Match: పోరాడి ఓడిన భారత్.. ఆసియా కప్ ఫైనల్ ఆశలు గల్లంతు.. ఫొటో గ్యాలరీ

తొలి మ్యాచ్‌లో గిల్ కేవలం ఏడు పరుగులే చేశాడు. అయితే, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో గిల్‌కు మరోఅవకాశం ఇవ్వాలని కెప్టెన్ పాండ్యా భావిస్తున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో.. ఎలాంటి మార్పులు లేకుండా మొదటి మ్యాచ్ లోని ఆటగాళ్లనే బరిలోకి దింపే అవకాశముంది. అయితే అర్ష్‌దీప్ సింగ్ ఫిట్‌గా ఉంటే హర్షల్ పటేల్ స్థానంలో అతనికి అవకాశం ఇవ్వచ్చు.

భారత్ తుది జట్టు (అంచనా):

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇసాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి.