Ind Vs SL : వాటే మ్యాచ్.. తొలి టీ20లో శ్రీలంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 2 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది.(Ind Vs SL)

Ind Vs SL : వాటే మ్యాచ్.. తొలి టీ20లో శ్రీలంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

Ind Vs SL : శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 2 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ పోరులో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 160 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.

శ్రీలంక ఇన్నింగ్స్ లో కెప్టెన్ దసున్ శనక 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడికి హసరంగ (10 బంతుల్లో 21) నుంచి సహకారం అందించింది. ఓ దశలో శ్రీలంక 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా ఈ జోడీ ఆదుకుంది. అయితే హసరంగను శివమ్ మావి ఔట్ చేయగా, శనకను ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ చేర్చాడు.

Also Read..Jaydev Unadkat: రంజీట్రోఫీలో జయదేవ్ ఉనద్కత్ సంచలనం.. మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్

చివరి ఓవర్లో లంక విజయానికి 13 పరుగులు అవసరం కాగా, కరుణరత్నే (23 నాటౌట్), కసున్ రజిత (5) జోడీ పోరాడింది. ఆఖర్లో ఒక్క బంతికి 4 పరుగులు కావాల్సి ఉండగా, అక్షర్ పటేల్ విసిరిన బంతిని కరుణరత్నే బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆఖరి ఓవర్లో ఇద్దరు రనౌట్ అయ్యారు.(Ind Vs SL)

టీమిండియా బౌలర్లలో డెబ్యూ బౌలర్ శివమ్ మావి అదరగొట్టాడు. కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ తలో 2 వికెట్లతో సత్తా చాటారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది. రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 5న పుణేలో జరగనుంది.

Also Read..VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. ద్రావిడ్ పదవీ కాలం ముగిసిన తర్వాత నియామకం

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. చివర్లో దీపక్ హుడా, అక్షర్ పటేల్ రెచ్చిపోవడంతో ఈ మాత్రం స్కోరైనా సాధ్యమైంది. హుడా 23 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సులతో 41 పరుగులు చేయగా.. అక్షర్ పటేల్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సుతో 31 పరుగులు చేశాడు.

కెప్టెన్ హార్దిక్ పాండ్య 29, ఓపెనర్ ఇషాన్ కిషన్ 37 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ దూకుడు చూస్తే భారత భారీ స్కోరుపై కన్నేసినట్టు కనిపించింది. అయితే లంక స్పిన్నర్లు భారత్ దూకుడును అడ్డుకున్నారు. దాంతో 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

శుభ్ మాన్ గిల్ 7, సూర్యకుమార్ యాదవ్ 7, సంజు శాంసన్ 5 నిరాశపరిచారు. ఈ దశలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఔటయ్యాక, ఆ బాధ్యతను హుడా, అక్షర్ పటేల్ తీసుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఆఖర్లో బ్యాట్లు ఝుళిపించి భారత్ స్కోరును 150 మార్కు దాటించారు.