VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. ద్రావిడ్ పదవీ కాలం ముగిసిన తర్వాత నియామకం

ఇటీవల ద్రావిడ్ ఆధ్వర్యంలో టీమిండియా ప్రదర్శన అంతగా బాలేదు. అనేక మ్యాచుల్లో టీమిండియా ఓటమి పాలైంది. అంచనాలకు తగ్గట్లు టీమిండియా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో జట్టుకు సంబంధించి కీలక మార్పులు చేయాలని టీమిండియా భావిస్తోంది.

VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. ద్రావిడ్ పదవీ కాలం ముగిసిన తర్వాత నియామకం

VVS Laxman: భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ఈ ఏడాది వరల్డ్ కప్ తర్వాత పూర్తవుతుంది. ఆ తర్వాత ద్రావిడ్ స్థానంలో లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోంది.

Gayathri Raghuram: అన్నామలై నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదు: తమిళనాడు నేత గాయత్రి రఘురాం

ఇటీవల ద్రావిడ్ ఆధ్వర్యంలో టీమిండియా ప్రదర్శన అంతగా బాలేదు. అనేక మ్యాచుల్లో టీమిండియా ఓటమి పాలైంది. అంచనాలకు తగ్గట్లు టీమిండియా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో జట్టుకు సంబంధించి కీలక మార్పులు చేయాలని టీమిండియా భావిస్తోంది. అలాగే అక్టోబర్‌లో స్వదేశంలో జరగబోయే వరల్డ్ కప్‌కు జట్టును ముందు నుంచే పటిష్టంగా తయారు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందుకోసం అనేక అంశాల్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. దీనిలో భాగంగా అవసరమైతే కోచ్ విషయంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం కోచ్‌గా ఉన్న ద్రవిడ్ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆయన పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత లక్ష్మణ్ బాధ్యతలు చేపడుతారు. రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం పూర్తైన తర్వాత ఆయనను తిరిగి కొనసాగించే ఉద్దేశం బీసీసీఐకి లేదు.

Bengaluru: యూనివర్సిటీలో యువతి హత్య.. పెళ్లికి ఒప్పుకోనందుకు కత్తితో పొడిచి చంపిన యువకుడు

అందుకే లక్ష్మణ్ వైపు మొగ్గు చూపుతోంది. దీంతో ద్రావిడ్ తర్వాత లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్ అవ్వొచ్చు. ప్రస్తుతం లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీకి నాయకత్వం వహిస్తున్నాడు. దీని ద్వారా యువ క్రికెటర్లను ఆయన వెలికి తీస్తున్నారు. గతంలో రాహుల్ ద్రావిడ్ కోవిడ్ కారణంగా దూరమైనప్పుడు లక్ష్మణ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్, జింబాబ్వే వన్డే సిరీస్, న్యూజిలాండ్ టీ20, వన్డే సిరీస్‌లకు లక్ష్మణ్ కోచ్‌‌గా వ్యవహరించాడు. ఇందులో న్యూజిలాండ్ వన్డే సిరీస్ మినహా అన్నింట్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఎక్కువ విజయాలు అందించిన నేపథ్యంలో లక్ష్మణ్ అయితే, బాగుంటుందని బీసీసీఐ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.