India vs West Indies: వెస్టిండీస్‌తో భారత్ రెండో టీ20 మ్యాచ్.. నేడే!
వెస్టిండీస్-భారత్ మధ్య ఇవాళ(18 ఫిబ్రవరి 2022) రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగబోతుంది. రాత్రి 7 గంటలకు కోల్‌కతా వేదికగా మ్యాచ్ జరగనుండగా.. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే..

West Indies
India vs West Indies వెస్టిండీస్-భారత్ మధ్య ఇవాళ(18 ఫిబ్రవరి 2022) రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగబోతుంది. రాత్రి 7 గంటలకు కోల్‌కతా వేదికగా మ్యాచ్ జరగనుండగా.. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది రోహిత్ సేన. రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వన్డేసిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతోపాటు వరుసగా ఏడు టీ-20విజయాలతో అదరగొడుతున్న టీమిండియా ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది.
మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే కరీబియన్లు ఈ మ్యాచ్‌లోనైనా గెలవాల్సి ఉంది. ఇక దేశంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ-20 మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. స్టేడియంలోని అన్ని స్టాండ్స్‌లలోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.
బెంగాల్‌లో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోగా.. ప్రేక్షకుల అనుమతికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థనతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో కరోనా కేసులు తగ్గడంతో ప్రేక్షకులను రెండు, మూడు టీ-20 మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించాలని కోరుతూ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ అవిషేక్ దాల్మియా బీసీసీఐకి లేఖ రాశాడు. దీనిపై సభ్యులతో చర్చించిన తర్వాత మూడో టీ20కి అభిమానులను అనుమతించింది బీసీసీఐ.