IND-W vs SL-W : శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత మహిళా జట్టు ఇదే.. ఇద్దరు తెలుగమ్మాయిలకు చోటు
డిసెంబర్ 21 నుంచి భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య (IND-W vs SL-W) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
India Women squad Announced for T20I series against Sri Lanka
IND-W vs SL-W : డిసెంబర్ 21 నుంచి భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో (IND-W vs SL-W) పాల్గొనే భారత మహిళా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. మొత్తం 15 మంది ప్లేయర్లకు చోటు ఇచ్చారు. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోనే భారత్ బరిలోకి దిగనుంది. ఆమెకు డిప్యూటీగా స్మృతి మంధాన వ్యవహరించనుంది.
ముంబై వికెట్ కీపర్ జి,కమలిని, మధ్యప్రదేశ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మలు తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నారు. తెలుగు అమ్మాయిలు శ్రీచరణి, అరుంధతి రెడ్డి లు కూడా జట్టులో తమ స్థానాలను నిలుపుకున్నారు. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడిన రాధా యాదవ్, యాస్టికా భాటియా, సయాలి సత్ఘారే లు లంక సిరీస్‌కు ఎంపిక కాలేదు.
IND vs SA : వికెట్ కీపింగ్‌లో మహేంద్ర సింగ్ ధోని రికార్డును సమం చేసిన జితేశ్ శర్మ
వైజాగ్, తిరువనంతపురం టీ20లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ , స్నేహ రాణా, జెమీమా రోడ్రిగ్స్ , షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి , క్రాంతి సింఘ్‌హూడ్, రేణుక్ థాకౌర్, రేణుక్ థాకౌర్ ఎన్ శ్రీ చరణి, వైష్ణవి శర్మ.
టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – డిసెంబర్ 21 (వైజాగ్)
* రెండో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 23 (వైజాగ్)
* మూడో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 26 (తిరువనంతపురం)
* నాలుగో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 28 (తిరువనంతపురం)
* ఐదో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 30 (తిరువనంతపురం)
🚨 News 🚨#TeamIndia’s squad for the 5⃣-match T20I series against Sri Lanka Women announced.
More details – https://t.co/CS41IPCECP#INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/uqavBNZpEL
— BCCI Women (@BCCIWomen) December 9, 2025
