పక్షిలా గాల్లోకి ఎగిరి.. రాధా యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన క్యాచ్ ..

ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పక్షిలా గాల్లోకి ఎగిరి.. రాధా యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన క్యాచ్ ..

Radha Yadav stunning catch

Updated On : July 14, 2025 / 7:04 AM IST

India Women Vs England Women 5th T20: ఇండియా ఉమెన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్స్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఐదో టీ20 మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అరుంధతి రెడ్డి బౌలింగ్‌లో భారత ప్లేయర్ రాధా యాదవ్ అద్భుత క్యాచ్ అందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళా క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్ అంటూ రాధా యాదవ్‌ను అభినందిస్తున్నారు.


ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతికి 168 పరుగుల లక్ష్యాణ్ని ఛేదించింది. అయితే, సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 41బంతుల్లో 75 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి విజయం సాధించింది. చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.