చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌.. 59 ఏళ్లుగా గ్యారీ సోబర్స్ పేరిట ఉన్న రికార్డు బద్దలు

"అవే టెస్ట్ సిరీస్‌"లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..

చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌.. 59 ఏళ్లుగా గ్యారీ సోబర్స్ పేరిట ఉన్న రికార్డు బద్దలు

shubman gill

Updated On : July 31, 2025 / 10:19 PM IST

ప్రస్తుతం జరుగుతోన్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డులు బద్దలుకొడుతున్నాడు. గురువారం ఓవల్‌లో జరిగిన ఐదవ టెస్టు మొదటి రోజు మొదటి సెషన్‌లో శుభ్‌మన్ గిల్ మొత్తం 35 బంతల్లో 21 రన్స్ బాది ఔటయ్యాడు.

అంతకుముందు యశస్వి జైస్వాల్, కేల్ రాహుల్ అతి తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. 16వ ఓవర్‌లో గిల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 23 బంతుల్లో 15 పరుగులు చేసి లంచ్ బ్రేక్‌కు ముందు భారత్ మరిన్ని వికెట్లు కోల్పోకుండా చేశాడు.

ముందుకు దూసుకొచ్చిన శుభ్‌మన్ గిల్
గిల్ గురువారం ప్రపంచ రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్‌ పేరిట 59 ఏళ్లుగా ఉన్న రికార్డును అధిగమించాడు. 35 బంతుల్లో 21 పరుగులకు అవుట్ అయిన తర్వాత గిల్ తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 82.55 సగటుతో మొత్తం 743 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు ఉన్నాయి. దీంతో “అవే టెస్ట్ సిరీస్‌”లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

“అవే టెస్ట్ సిరీస్” అంటే ఒక క్రికెట్ జట్టు స్వదేశంలో కాకుండా మరొక దేశంలో ఆడే టెస్ట్ సిరీస్. భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడితే, అది భారత జట్టుకు ఇది “అవే టెస్ట్ సిరీస్” అవుతుంది. అలాగే, ఇంగ్లాండ్‌ జట్టు భారత్‌కు వచ్చి ఆడితే అది ఇంగ్లాండ్‌కు “అవే టెస్ట్ సిరీస్” అవుతుంది. ఇలా శుభ్‌మన్ గిల్ ఒక కెప్టెన్‌గా విదేశీ గడ్డపై ఆడిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించి.. గ్యారీ సోబర్స్ రికార్డును బద్దలు కొట్టాడు.

“అవే టెస్ట్ సిరీస్‌”లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

ఆటగాడు జట్టు దేశం పరుగులు మ్యాచ్‌లు సంవత్సరం
శుభ్‌మన్ గిల్ ఇండియా ఇంగ్లాండ్ 743* 5 2025
గ్యారీ సోబర్స్ వెస్టిండీస్ వెస్టిండీస్ 722 5 1966
గ్రేమ్ స్మిత్ సౌతాఫ్రికా సౌతాఫ్రికా 714 5 2003
లియోనార్డ్ హటన్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ 677 5 1954
క్లైవ్ లాయిడ్ వెస్టిండీస్ ఇండియా 636 5 1974-75

ఇప్పటికే శుభ్‌మన్ గిల్ ఒక టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా నాలుగు సెంచరీలు సాధించి సునీల్ గవాస్కర్, డాన్ బ్రాడ్‌మాన్ల రికార్డును సమం చేశాడు. డాన్ బ్రాడ్‌మాన్ 1947-48లో భారత్‌తో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్‌లో నాలుగు శతకాలు సాధించారు. సునీల్ గవాస్కర్ 1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్‌లో నాలుగు శతకాలు సాధించారు.

అలాగే, గిల్ ఓ టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కూడా నిలిచాడు. 1978లో వెస్టిండీస్‌తో సిరీస్‌లో గవాస్కర్ చేసిన రికార్డును అధిగమించాడు.

టెస్ట్ సిరీస్‌లో భారత కెప్టెన్ చేసిన అత్యధిక పరుగులు

ఆటగాడు ప్రత్యర్థి ఆతిథ్య దేశం పరుగులు మ్యాచ్‌లు సంవత్సరం
శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ 743 5 2025
సునీల్ గవాస్కర్ వెస్టిండీస్ ఇండియా 732 6 1978-79
విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ ఇండియా 655 5 2016
విరాట్ కోహ్లీ శ్రీలంక ఇండియా 610 3 2017
విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ 593 5 2018

గిల్ ప్రస్తుతం టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడవ స్థానంలో ఉన్నాడు. బ్రాడ్‌మన్ చేసిన 810 పరుగుల రికార్డు దిశగా అడుగులు వేస్తున్నాడు.