Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా

ఆసియా కప్‌ హాకీ పోటీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత హాకీ పురుషుల జట్టు దుమ్ములేపింది. పూల్‌-ఏలో భాగంగా ఇండోనేషియాతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ జరింగింది. ఇందులో రెచ్చిపోయిన భారత పురుషుల జట్టు ఏకంగా 16-0 తో సూపర్‌-4కు అర్హత సాధించింది.

Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా

Indin Hock

Updated On : May 26, 2022 / 10:48 PM IST

Indian Hockey: ఆసియా కప్‌ హాకీ పోటీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత హాకీ పురుషుల జట్టు దుమ్ములేపింది. పూల్‌-ఏలో భాగంగా ఇండోనేషియాతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ జరింగింది. ఇందులో రెచ్చిపోయిన భారత పురుషుల జట్టు ఏకంగా 16-0 తో సూపర్‌-4కు అర్హత సాధించింది. టీమిండియా తరపున డిస్పన్‌ టిర్కీ 4 గోల్స్‌ బాదారు.

అతనితో పాటు సుదేవ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరిశాడు. సెల్వం, పవన్‌, వెటరన్‌ ఆటగాడు ఎస్‌వీ సునీల్‌లు కీలక సమయాల్లో గోల్స్‌తో మెరిసి హాకీ టీమిండియాకు విజయం అందించారు. పురుషుల ఆసియా హాకీ కప్‌ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయం.

ఇండోనేషియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఓపెనింగ్‌ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ను 2-5తో ఓడిపోవడంతో సూపర్‌-4 అవకాశాలను సంక్లిష్టంగా మారాయి. ఇండోనేషియాతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో 15 గోల్స్‌ కొడితే గానీ భారత్‌కు సూపర్‌-4కు అర్హత సాధించే అవకాశం ఉండేది.

Read Also : హాకీ పురుషుల ప్రపంచ కప్ అధికారిక లోగో ఆవిష్కరణ..

అదే సమయంలో జపాన్‌ చేతిలో పాకిస్తాన్‌ కూడా ఓటమి గురికావాలి. ఆశించినట్లే జపాన్‌ చేతిలో పాకిస్తాన్‌ ఓడిపోయింది. ఇండోనేషియాతో​ మ్యాచ్‌లో ఒక గోల్‌ ఎక్కువే కొట్టిన టీమిండియా గ్రాండ్‌ విక్టరీ అందుకొని సూపర్‌-4లో అడుగుపెట్టింది. జపాన్‌, కొరియా మలేషియాలు 2023 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.

మరోవైపు 2023 హాకీ వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండడంతో ఆతిథ్య హోదాలో భారత పురుషుల హాకీ జట్టు ఇప్పటికే పోటీలో ఉన్నట్లే.