Paralympics : భార‌త్ ఖాతాలో మ‌రో ప‌త‌కం.. స‌చిన్‌కు ర‌జ‌తం..

పారిస్ వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప‌త‌కాల వేట కొన‌సాగుతోంది.

Paralympics : భార‌త్ ఖాతాలో మ‌రో ప‌త‌కం.. స‌చిన్‌కు ర‌జ‌తం..

Indian para athlete Sachin Khilari wins silver in mens shot put F46 category

Paralympics 2024 : పారిస్ వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప‌త‌కాల వేట కొన‌సాగుతోంది. బుధ‌వారం భార‌త్‌ ఖాతాలో మ‌రో ప‌త‌కం వ‌చ్చి చేరింది. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46లో ప్రపంచ ఛాంపియన్‌ సచిన్ సర్జేరావు ఖిలారీ ర‌జ‌త ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో భార‌త ప‌త‌కాల సంఖ్య 21కి చేరింది.

కెనడాకు చెందిన గ్రెగ్ స్టువర్ట్ 16.38 మీ దూరం విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. సచిన్ సర్జేరావు ఖిలారీ 16.32 మీట‌ర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. క్రోయేషియా అథ్లెట్‌ బకోవిక్ లుకా 16.27 మీ దూరం విసిరి కాంస్య ప‌త‌కాన్ని సాధించాడు. ఇక ఇదే ఈవెంట్లో సచిన్‌తో పాటు పోటీ పడిన భారత అథ్లెట్లు మొహ్మద్‌ యాసిర్ 14.21 మీట‌ర్లు, రోహిత్‌ కుమార్ 14.10 మీట‌ర్ల దూరం విసిరి వరుసగా 8, 9వ స్థానాల్లో నిలిచారు.

Rahul Dravid : రాజస్థాన్‌ రాయల్స్‌ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!

భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు గెలుచుకున్న ప‌త‌కాల్లో మూడు స్వ‌ర్ణాలు, ఎనిమిది ర‌జ‌తాలు, 10 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. 21 ప‌త‌కాల‌తో భార‌త్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం 19వ స్థానానికి చేరుకుంది.

టేబుల్ టెన్నిలో నిరాశ‌..
టేబుల్ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌54లో భారత్‌కు నిరాశే ఎదురైంది. టోక్యోలో రజతం సాధించిన భవీనా పటేల్ ఈ సారి ఎలాంటి ప‌త‌కం లేకుండానే ఇంటి ముఖం ప‌ట్టింది. ఆమె పోరాటం క్వార్ట‌ర్స్‌లోనే ముగిసింది. 1-3 (12-14, 9-11, 11-8, 6-11)తో యింగ్ జౌ (చైనా) చేతిలో ఓడిపోయింది.

Gill-Ananya Pandey : శుభ్‌మ‌న్ గిల్‌తో బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే.. రియాన్ ప‌రాగ్‌ను ఆడుకుంటున్న నెటిజ‌న్లు