IND-W vs ENG-W 3rd T20
India Women vs England Women 3rd T20 : మొదటి రెండు టీ20 మ్యాచుల్లో ఓడి సిరీస్ చేజార్చుకున్న టీమ్ఇండియా ఆఖరి నామమాత్రమైన మూడో టీ20 మ్యాచులో గెలిచి పరువు దక్కించుకుంది. 127 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళల జట్టు 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (48; 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమిమా రోడ్రిగ్స్ (29; 33 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్, సోఫీ ఎక్లెస్టోనెప్ లు చెరో రెండు వికెట్లు తీశారు. షార్లెట్ డీన్ ఓ వికెట్ పడగొట్టింది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హెథర్‌నైట్ (52; 42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసింది. అమీ జోన్స్ (25; 21 బంతుల్లో 3 ఫోర్లు), షార్లెట్ డీన్ (16 నాటౌట్) రాణించారు. సోఫీ డంక్లీ 11, ఆలిస్ క్యాప్సే 7 పరుగులు చేయగా మైయా బౌచియర్, డేనియల్ గిబ్సన్, ఫ్రెయా కెంప్ లు డకౌట్లు అయ్యారు. భారత బౌలర్లో శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. రేణుకా సింగ్, అమన్‌జ్యోత్ సింగ్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
Wasim Jaffer : ఐపీఎల్‌లో ఆ రూల్‌ను తీసేయండి.. లేదంటే భారత క్రికెట్‌కు పెను ముప్పు తప్పదు..!
ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినప్పటికీ మొదటి రెండు టీ20ల్లో ఓడిపోవడంతో 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఇక ఇరు జట్ల ఏకైక టెస్టు మ్యాచ్ డిసెంబర్ 14న ముంబైలో జరగనుంది.
India wins comprehensively in the third T20I against England ?#INDvENG | ?: https://t.co/suVxkzKptE pic.twitter.com/kAySjvcIOn
— ICC (@ICC) December 10, 2023