INDvsSL: పింక్ బాల్ టెస్టుకు 100శాతం మంది అభిమానులు

ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టెస్ట్ మ్యాచ్ అయిన పింక్ బాల్ గేమ్ శనివారం నుంచి ఆరంభం కానుంది. ఈ గేమ్ కోసం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో వంద శాతం మందిని అనుమతించనున్న

INDvsSL: పింక్ బాల్ టెస్టుకు 100శాతం మంది అభిమానులు

Indvssl (1)

Updated On : March 11, 2022 / 10:56 AM IST

INDvsSL: ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టెస్ట్ మ్యాచ్ అయిన పింక్ బాల్ గేమ్ శనివారం నుంచి ఆరంభం కానుంది. ఈ గేమ్ కోసం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో వంద శాతం మందిని అనుమతించనున్నట్లు చెప్పింది. కొవిడ్-19 కేసులు తగ్గడంతో మ్యాచ్ లు చూడటానికి టిక్కెట్లపై డిమాండ్ పెరిగిపోయింది.

‘కేఎస్‌సీఏ (కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్) ఈ విషయం తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఫీలవుతుంది. ఇండియా వర్సెస్ శ్రీలంక డే – నైట్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మార్చి 12-16 మధ్యలో జరుగుతుంది.

‘దీనికి ఎక్కువ మంది వచ్చేందుకు ఎటువంటి నిబంధనలతో కట్టడి చేయకుండా ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వనున్నాం. స్టేడియంలో ఫుల్ కెపాసిటీ టిక్కెట్లు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని కేఎస్సీఏ ట్రెజరర్ వినయ్ మృత్యుంజయ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు..

Read Also: ‘టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మది అద్భుతమైన ఎంట్రీ’

ఆ ఒక్క రోజు మ్యాచ్ టిక్కెట్ ధరలు ఇలా ఉణ్నాయి. గ్రాండ్ టెర్రస్ (రూ.1250), ఈ ఎగ్జిక్యూటివ్ (రూ.750), డీ కార్పొరేట్ (రూ.500), రూ.100వరకూ ఉండనున్నాయి. తొలి టెస్టులోనూ మొహాలీ స్టేడియానికి 50శాతం మంది అభిమానులకు అనుమతినిచ్చారు.