T20 World Cup: థియేటర్లలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు
ఐసీసీ నిర్వహించే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను తమ థియేటర్లలో ప్రదర్శిస్తామని మల్టీప్లెక్స్‌ల నిర్వహణ సంస్థ ఐనాక్స్ లీజర్ వెల్లడించింది.

T20 World Cup
T20 World Cup: మరికొద్దిరోజుల్లో టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వబోతుంది. ఐసీసీ నిర్వహించే ఈ మెగా టోర్నీ క్రికెట్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లను తమ థియేటర్లలో ప్రదర్శిస్తామని మల్టీప్లెక్స్‌ల నిర్వహణ సంస్థ ఐనాక్స్ లేజర్(Inox Leisure) వెల్లడించింది. భారత్‌లో ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు యూఏఈ, ఒమన్‌లలో నిర్వహిస్తున్నారు.
ఈ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. నవంబరు 14వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే, ఈ మ్యాచ్‌లను అన్ని ప్రధాన నగరాల్లో తమ ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రదర్శిస్తామని యాజమాన్యం ప్రకటించింది. అయితే, భారత మ్యాచ్‌లను మాత్రమే ప్రదర్శిస్తామని ప్రదర్శిస్తామని ఐనాక్స్ తెలిపింది. మొత్తం 70నగరాల్లో 56మల్టీప్లెక్స్‌ల్లో 658 స్క్రీన్‌లు ఐనాక్స్ నిర్వహణలో ఉన్నాయి.
పెద్ద స్క్రీన్ మీద మ్యాచ్‌లను చూడడం ద్వారా డైరెక్ట్‌గా చూసిన అనుభూతి కలుగుతుందని క్రికెట్ మైదానంలోనే మ్యాచ్‌లను వీక్షించినట్లే ఉంటుందని, విక్షకులకు మంచి అనుభూతి కలిగించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఐనాక్స్ సంస్థ చెబుతోంది.
మ్యాచ్‌లను చూస్తూ ఆహార పదార్థాల కోసం క్రికెట్ అభిమానులు ఆర్డరు ఇస్తారు కాబట్టి వ్యాపార కోణంలో కూడా మేలు జరుగుతుంది అని భావిస్తుంది యాజమాన్యం. క్రికెట్ మ్యాచ్‌ల చూసేవారికి టికెట్టు ధర నగరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ఉండొచ్చని ఐనాక్స్ చెబుతుంది.
Read More: