Job Vacancies : టెక్ కంపెనీల ఉద్యోగజాతర…గ్రాడ్యుయేట్స్ లో తొలగుతున్న జాబ్ వర్రీ

ప్రధానంగా కొత్త నియామకాలకు సంబంధించి ఫ్రెషర్స్ పైనే దృష్టిపెట్టాయి. ఈ ఏడాది చివరి నాటికి టెక్ సంస్ధలు లక్షమందికి పైగా ఫ్రెషర్స్ కు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలుస్తుంది.

Job Vacancies : టెక్ కంపెనీల ఉద్యోగజాతర…గ్రాడ్యుయేట్స్ లో తొలగుతున్న జాబ్ వర్రీ

Tech Jobs

Job Vacancies : కరోనా పరిస్ధితుల నేపధ్యంలో ఉపాధి అవకాశాలు లేక చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఇబ్బందికరమైన పరిస్ధిని చవిచూశాయి. గత నాలుగైదు మాసాలుగా ఆ పరిస్ధితిలో చిన్చచిన్నగా మార్పు వస్తుంది. టెక్ కంపెనీలు తమ సంస్ధల్లో కావాల్సిన మేన్ పవర్ ను సమకూర్చుకునే ప్రయత్నాలు ప్రస్తుతం నిమగ్నమయ్యాయి. ప్రధానంగా కొత్త నియామకాలకు సంబంధించి ఫ్రెషర్స్ పైనే దృష్టిపెట్టాయి. ఈ ఏడాది చివరి నాటికి టెక్ సంస్ధలు లక్షమందికి పైగా ఫ్రెషర్స్ కు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా వుంటే టీసీఎస్ ఇప్పటికే 43వేల మంది తాజా గ్రాడ్యుయేట్స్ ని తమ సంస్ధలోకి తీసుకోగా, రానున్న రోజుల్లో మరో 35వేల మందిని రిక్రూట్ చేసుకోవాలన్న ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని సదరు సంస్ధ ప్రతినిధులు సైతం గత వారం ధృవీకరించారు. మరోవైపు ఇన్ఫోసిస్‌ సంస్ధ 35వేల మంది ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది.

ఉద్యోగుల వలస సమస్య రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో వారి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ రావు తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే లోపల మరో 10వేల మందిని ఎంపిక చేసుకోనున్నట్లు చెప్పారు.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సైతం ఈ ఏడాది చివరి నాటికి 20వేల నుంచి 22వేల మందిని, వచ్చే ఏడాదిలో మరో 30వేల మంది ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్‌లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. వర్చువల్‌ వర్క్‌ డిమాండ్‌ పెరగడంతో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ కంపెనీలు లక్షమందిని నియమించుకోనున్నట్లు తెలిపాయి.