ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్ ముందు పాకిస్తాన్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్‌గా మాజీ దిగ్గజ ఆటగాడు..
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

Inzamam ul Haq
ODI World Cup : భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ను చీఫ్ సెలెక్టర్‌గా నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఆగస్టు 22న శ్రీలంకలో అఫ్గానిస్థాన్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడం ఇంజమామ్ మొక్క మొదటి పని.
ఆ తరువాత ఆసియాకప్‌తో పాటు భారత్ వేదికగా జరిగే ప్రపంచకప్‌కు ఇంజమామ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. సెలెక్షన్ కమిటీలో ఇంజమామ్‌తో పాటు టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, హెడ్‌కోచ్ బ్రాడ్‌బర్న్ ఉన్నారని పీసీబీ ప్రతినిధి ఒకరు తెలిపారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సూచనల మేరకే టీమ్ డైరెక్టర్, హెడ్ కోచ్‌లను సెలెక్షన్ ప్యానెల్‌లో కొనసాగించామని చెప్పారు.
Sunrisers Hyderabad : సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా డేనియల్ వెటోరి.. లారా పై వేటు
కాగా.. ఇంజమామ్ గతంలో 2016 నుండి 2019 వరకు పాక్ నేషనల్ మెన్స్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా పని చేశాడు. ప్రపంచకప్ ముందర అతడిని తిరిగి తీసుకురావడానికి అతడి మొక్క అనుభవం, నైపుణాన్ని ఉపయోగించుకోవాలని పాకిస్తాన్ బోర్డు బావించడమే కారణం. ఇంజమామ్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన జట్టు సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వంలో 2017లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
పాకిస్తాన్ జట్టు ఇటీవల అస్థిరమైన ప్రదర్శనలు చేస్తోంది. ప్రస్తుతం పుంజుకోవాలని చూస్తోన్న తరుణంలో ఇంజమామ్ నియామకం జరిగింది. మైదానంలో, వెలుపల.. వ్యూహా, ప్రతివ్యూహాలకు ప్రసిద్ది చెందిన ఇంజమామ్ తన జట్టు కోసం పదునైన వ్యూహాలను రచించి బలమైన జట్టును తయారు చేస్తాడని పాకిస్తాన్ అభిమానులు భావిస్తున్నారు.
IND vs WI : చాహల్ పై కెప్టెన్ హార్దిక్ పాండ్యకు నమ్మకం లేదా..? కారణం ఏంటి..?
Former Pakistan captain Inzamam ul Haq has been appointed national men’s chief selector. pic.twitter.com/TnPdQaoXvW
— Pakistan Cricket (@TheRealPCB) August 7, 2023